• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎంగా ఆయనొద్దు.. అతడే ముఖ్యమంత్రి.. ముదురుతున్న గోవా రాజకీయం

|

పనాజీ : గోవా ముఖ్యమంత్రి పీఠం మరోసారి చర్చానీయాంశమైంది. ప్రస్తుత సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్య పరిస్థితే అందుకు కారణం. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండటం వల్ల బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటోంది కాంగ్రెస్ పార్టీ. అయితే బీజేపీలో మాత్రం భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొందరేమో పారికర్ కు జై కొడుతుంటే.. మరికొందరేమో ముఖ్యమంత్రిని మార్చాలనే ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు. మొత్తానికి ఇలాంటి పరిస్థితుల మధ్య గోవా సీఎం కుర్చీ హాట్ హాట్ గా మారింది.

కాంగ్రెస్ నాలుగో జాబితా.. అక్కడినుంచే శశిథరూర్.. కేవీ థామస్ కు మొండిచేయికాంగ్రెస్ నాలుగో జాబితా.. అక్కడినుంచే శశిథరూర్.. కేవీ థామస్ కు మొండిచేయి

పొలిటికల్ సినారియో

పొలిటికల్ సినారియో

గోవా రాజకీయం మరోసారి వేడెక్కింది. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్యం కారణంగా గోవాలో పరిణామాలు మారుతున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని శనివారం నాడు కాంగ్రెస్ నేతలు గోవా గవర్నర్ ను కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో పారికర్ స్థానంలో ఇతరులను సీఎంగా నియమించాలనే ప్రతిపాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో కమలం పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పారికర్ నే సీఎంగా కొనసాగించాలని కొందరంటే.. లేదు ఇతరులను నియమించాలని అంటున్నారు మరికొందరు.

పారికరే సీఎం.. కాదు మార్చాల్సిందే..!

పారికరే సీఎం.. కాదు మార్చాల్సిందే..!

గోవా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మనోహర్ పారికర్ కొంతకాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆ మేరకు కొద్దిరోజుల పాటు అమెరికాలో వైద్యం కూడా తీసుకున్నారు. ఢిల్లీ, ముంబయి, గోవాలోని ప్రముఖ ఆసుపత్రుల్లో సైతం చికిత్స పొందారు. అనంతరం కొంతలో కొంత ఆరోగ్యం కుదుటపడినట్లు అనిపించినా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత నెలలో మళ్లీ అనారోగ్యం బారిన పడటంతో ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం అందుతోంది.

పారికర్ ఆరోగ్య పరిస్థితిపై సొంత గూటి నేతలే తలో మాట మాట్లాడుతున్నారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని కొందరంటుంటే.. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదంటున్నారు మరికొందరు. ఈ నేపథ్యంలో పారికర్ స్థానంలో మరో ముఖ్యమంత్రిని నియమిస్తేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గవర్నర్ ను కాంగ్రెస్ నేతలు కలిసిన దరిమిలా బీజేపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి దయానందర్ మండ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారం కోల్పోవద్దని భావిస్తే.. సీఎంను మార్చాల్సిన అవసరముందన్నారు. అటు గోవా డిప్యూటీ స్పీకర్ మైకెల్ లోబో కూడా పారికర్ ఆరోగ్యం కుదుటపడే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

నిలకడగానే ఆరోగ్యం

నిలకడగానే ఆరోగ్యం

పారికర్ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి విజయ్ సర్ దేశాయ్. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరమైతే లేదని వివరించారు. ఈ సమయంలో బీజేపీ శ్రేణులు పారికర్ కు అండగా నిలబడాలని కోరారు. కొద్దిరోజుల్లోనే పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
Goa Politics taking U turn in changing Chief minister. Some of BJP Leaders supporting present cm manohar parikar even his health condition was not good. Some other leaders want to change the CM. Congres Leaders met with governor and request for cancellation of bjp government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X