• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

GOA Polls: ఆప్ గెలిస్తే ..నిరుద్యోగులకు 3 వేలు భృతి, లోకల్ కోటా; విద్యుత్ పైన కేజ్రీవాల్ ఎన్నికల హామీలు !!

|

వచ్చే ఏడాది గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గోవాలో నిరుద్యోగులకు, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని, స్థానికులకు ప్రైవేటు రంగ ఉద్యోగాలలో 80 శాతం కోటా ఇస్తామని ఆసక్తికర ప్రకటన చేశారు. గోవా ఎన్నికల బరిలోకి దిగుతున్న కారణంగా ఆప్ అధినేత ఈ రోజు హామీల వర్షం కురిపించారు. ఈరోజు పనాజీలో మాట్లాడిన ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గోవాలో తమ పార్టీ పోటీలో ఉండనున్న నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని పేర్కొన్నారు.

షాకింగ్ : సోను సూద్ పై ఐటీ నజర్ .. hyd సహా 6 చోట్ల తనిఖీలు; ఆ సీఎంతో భేటీ తర్వాత ..షాకింగ్ : సోను సూద్ పై ఐటీ నజర్ .. hyd సహా 6 చోట్ల తనిఖీలు; ఆ సీఎంతో భేటీ తర్వాత ..

గోవాలా నిరుద్యోగులకు కేజ్రీవాల్ హామీ .. మూడు వేల నిరుద్యోగ భృతి

గోవాలా నిరుద్యోగులకు కేజ్రీవాల్ హామీ .. మూడు వేల నిరుద్యోగ భృతి


ప్రతి ఇంట్లో ఒకరికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. గోవా యువతకు 80 శాతం ఉద్యోగాలు రిజర్వు చేస్తామని చెప్పిన ఆయన, ప్రైవేటు ఉద్యోగాలలోనూ 80% కోటా ఉండేలా చూస్తామన్నారు. గోవా ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఏడు హామీలలో నిరుద్యోగ భృతి ఒకటి. ఇక టూరిజం పై ఆధారపడిన కుటుంబాలు కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్నాయని పేర్కొన్న అరవింద్ కేజ్రీవాల్ టూరిజంపై ఆధారపడిన వారికి నెలకు 5000 రూపాయలు ఇస్తామని వెల్లడించారు. గనులు మూసివేయడం వల్ల గోవాలో మైనింగ్లో పనిచేసే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్న కేజ్రీవాల్ వారికి పనులు మొదలయ్యే వరకు నెలకు 5000 రూపాయలు ఇస్తామని వెల్లడించారు.

ఉత్తరాఖండ్ లోనూ నిరుద్యోగ భృతి హామీ ఇచ్చిన కేజ్రీవాల్

ఉత్తరాఖండ్ లోనూ నిరుద్యోగ భృతి హామీ ఇచ్చిన కేజ్రీవాల్


వచ్చే సంవత్సరం జరుగనున్న ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల బరిలోకి దిగనున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఎన్నికల కసరత్తు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. పంజాబ్ ఎన్నికలపైన ఫోకస్ చేస్తున్న ఆప్ ఇప్పటికే పంజాబ్ కు అనేక హామీలు ఇచ్చింది. తాజాగా ఉత్తరాఖండ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో అనేక హామీలు ఇచ్చారు. ఉత్తరాఖండ్లో అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలో ఒక నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తామని ఇక ఉద్యోగాల్లో స్థానికులకు 80 శాతం కోటా ఇస్తామని వెల్లడించారు.

రాజకీయ పార్టీలు గోవాను దోపిడీ చేశాయని ఆరోపణ

రాజకీయ పార్టీలు గోవాను దోపిడీ చేశాయని ఆరోపణ

ఇప్పుడు తాజాగా అదే తరహాలో గోవాలో కూడా నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తూ హామీలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుందని మరియు ప్రతి ఇంటి నుండి కనీసం ఒక నిరుద్యోగికి ఉద్యోగం లభించేలా చూస్తారని కూడా చెప్పారు.అరవింద్ కేజ్రీవాల్ పనాజీలో మాట్లాడుతూ గోవా ఒక అందమైన రాష్ట్రం , భగవంతుడు గోవాకు అన్నీ ఇచ్చాడని, కానీ రాజకీయ పార్టీలు గోవాను దోపిడీ చేశాయని అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. మేము ఈ దోపిడీని అరికట్టాలని విస్తృతమైన ప్రణాళికను రూపొందించామని కేజ్రీవాల్ చెప్పారు.

గోవా పర్యాటకం, విద్యుత్ పై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు .. పలు హామీలు

గోవా పర్యాటకం, విద్యుత్ పై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు .. పలు హామీలు

ఇదే సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాష్ట్ర ఆర్ధికవ్యవస్థపై కోవిడ్ -19 ప్రభావాన్ని హైలైట్ చేసారు . గోవా పర్యాటక ఆదాయంపై ఆధారపడుతుందని, మైనింగ్ పరిశ్రమపై కోవిడ్ ప్రేరిత ఆంక్షల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి, అలాగే బాధిత ప్రజలకు నిరుద్యోగ భృతి నెలకు ఐదు వేల రూపాయల చొప్పున ఇస్తామని పేర్కొన్నారు. కేజ్రీవాల్ గోవాలోనూ 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని వెల్లడించారు. అంతేకాదు రైతుల విద్యుత్ బిల్లులను ప్రభుత్వం పూర్తిగా చెల్లిస్తుందని చెప్పారు. గోవా ప్రజలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీ అభివృద్ధి నమూనాని గోవాలో ను అమలు చేస్తామన్నారు.

 ప్రమోద్ సావంత్ ఢిల్లీ మోడల్ కాపీ చేస్తున్నారు .. ఒరిజినల్ ఉండగా డూప్లికేట్ దేనికన్న కేజ్రీవాల్

ప్రమోద్ సావంత్ ఢిల్లీ మోడల్ కాపీ చేస్తున్నారు .. ఒరిజినల్ ఉండగా డూప్లికేట్ దేనికన్న కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్ తమకు అధికారం కట్టబెడితే ప్రజా సమస్యల పరిష్కారంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తామని తేల్చిచెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మరియు పాలక బిజెపిపై కూడా విమర్శలు గుప్పించారు. గోవాలో ప్రమోద్ సావంత్ ఈమధ్య నీటిని ఉచితంగా అందించారని , మేము నాలుగు సంవత్సరాల క్రితమే ఢిల్లీలో చేశామని వెల్లడించారు. సావంత్ డోర్‌స్టెప్ డెలివరీ ప్రారంభించాడని ,మేము మూడు సంవత్సరాల క్రితమే చేశామని పేర్కొన్నారు. ప్రమోద్ సావంత్ గోవాలో 'ఢిల్లీ మోడల్' కాపీ చేస్తున్నాడని ఆరోపించారు. అసలు ఆమ్ ఆద్మీ పార్టీ అందుబాటులో ఉన్నప్పుడు కాపీ కొట్టే డూప్లికేట్ పార్టీ అవసరం ఏమిటని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఏవిధంగా అయితే అవినీతి లేకుండా పాలన సాగించామో, అదే విధమైన పాలన గోవాలోనూ సాగిస్తామని తేల్చిచెప్పారు. తాము సామాన్యుల బాధ అర్థం చేసుకోగలమని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

English summary
Aam Aadmi party chief Arvind Kejriwal promises goa people for the upcoming goa elections. Announced unemployment allowance of ₹ 3,000 and 80 per cent quota for locals, fires on ruling BJP and assurances to the goa people over development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X