వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: రండిబాబు రండి, నేడే విడుదల, గోవా గ్రీన్ సిగ్నల్, రమ్మన్నారు, పొమ్మనలేక పొగపెడుతారా ?

|
Google Oneindia TeluguNews

గోవా/ న్యూఢిల్లీ: బీచ్ ల్లో ఉల్లాసంగా గడపడానికి, మద్యం ప్రియులకు గోవా పర్యాటక రంగం గుడ్ న్యూస్ చెప్పింది. రండిబాబు రండి నేడే విడుదల, ఆలసించిన ఆశాభంగం అంటూ నేటి నుంచి (జులై 2వ తేది) గోవా పర్యాటకులకు అక్కడి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గోవా పర్యాటకుల కోసం 250 హోటల్స్ నిర్వహించడానికి తాము అనుమతి ఇచ్చామని గోవా పర్యాటక శాఖ మంత్రి మనోహర్ అజ్గనోగర్ స్పష్టం చేశారు. అయితే పర్యాటకులకు కొన్ని రూల్స్ పెట్టారు. పర్యాటక రంగం నుంచి కరోనా క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకున్న వారు మాత్రమే గోవా బీచ్ లో, పర్యాటక ప్రాంతాల్లో పర్యటించడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పర్యాటకులకు చిర్రెత్తుతోంది. రమ్మని మీరే చెప్పి పొమ్మని పొగపెడుతున్నారా ? అంటూ కొందరు పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు.

Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్

 మీకు మాత్రమే, అక్కడ నో ఎంట్రీ

మీకు మాత్రమే, అక్కడ నో ఎంట్రీ

గోవాలో పర్యాటకులు బస చెయ్యడానికి 250 హోటల్స్ కు మాత్రమే గోవా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే గోవాకు వచ్చే పర్యాటకుల వివరాలు, వారి పూర్తి సమాచారంతో ముందుగా హోటల్స్ లోని గదులు బుక్ చేసుకోవాలని గోవా పర్యాటక శాఖ మంత్రి మనోహర్ అజ్గనోగర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతి లేని హోటల్స్ లో పర్యాటకులు బస చెయ్యడానికి వీలు లేదని, ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గోవా పర్యాటక మంత్రి మనోహర్ అజ్గనోగర్ హెచ్చరించారు.

 కరోనా క్లియరెన్స్

కరోనా క్లియరెన్స్

గోవాకు వచ్చే పర్యాటకులు ముందుగా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాలని గోవా ప్రభుత్వం సూచించింది. కరోనా నెగటివ్ ధ్రువపత్రం తీసుకోవాలని, కరోనా క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకునే గోవాలో అడుగు పెట్టాలని అక్కడి ప్రభుత్వం నియమాలు పెట్టింది. ఎవరైనా కరోనా పరీక్షలు చేయించుకోకుండా వచ్చినా గోవా సరిహద్దులో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని గోవా ప్రభుత్వం స్పష్టం చేసింది.

రమ్మని చెప్పి పొమ్మని పొగపెడతారా ?

రమ్మని చెప్పి పొమ్మని పొగపెడతారా ?

గోవా రాష్ట్ర సరిహద్దులో ఎవరైనా వైద్యపరీక్షలు చేయించుకుంటే వారికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూస్తే మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలని గోవా ప్రభుత్వం సూచించింది. గోవాలోని క్వారంటైన్ లో ఉండటానికి ఎవరైనా నిరాకరిస్తే వారి స్వస్థలాలకు వెళ్లడానికి తాము ఏర్పాట్లు చేస్తామని గోవా ప్రభుత్వం హామీ ఇచ్చింది. పర్యాటకులను రమ్మని చెప్పి తరువాత పొమ్మని మీరే పొగపెడతున్నారా ? అని కొందరు పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

Hyderabad Lockdown పై Public Response, రోజు 3 గంటలు మాత్రమే
 100 డేస్ సంబరాలు

100 డేస్ సంబరాలు

కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి భారతదేశంలో మార్చి 25వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలు చేశారు. భారతదేశంలో లాక్ డౌన్ అమలు చేసి ఇప్పటికే 100 రోజులు పూర్తి అయిపోయింది. వంద రోజులు పూర్తి అయిన తరువాత గోవాలో పర్యాటకులు సంచరించడానికి అనుమతి ఇవ్వడంతో ఇంత కాలం అక్కడి సుందరమైన బీచ్ ల్లో సంచరించే పర్యాటకులకు, గోవా లిక్కర్ కు దూరం అయిన పర్యాటకులు ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఎంజాయ్ చెయ్యడానికి సిద్దం అవుతున్నారు.

English summary
Lockdown: Goa to open for tourists from today as 250 hotels were granted permission to resume operations. For a tourist to enter Goa, he/she will have to carry a COVID19 negative certificate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X