చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీకి చీకటి రోజు, చరిత్రలో, ప్రపంచంలో No1 ట్రెండింగ్, ప్రధానిగా నో, టీ అమ్ముకోండి!

|
Google Oneindia TeluguNews

Recommended Video

చెన్నైలో మోడీ గో బ్యాక్ అంటూ నిరసనకారుల నినాదాలు..!

చెన్నై: తమిళనాడు ప్రజల ఐక్యత ఎలా ఉంటుందో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చూశారు. మీరు ప్రధానిగా పనికిరారని, ముందు మీరు చేసిన టీ అమ్ముకునే పని చేసుకోవాలని ఘాటుగా సోషల్ మీడియాలో సమాధానం ఇచ్చారు. మీ ముసలి కన్నీళ్లకు కరిగిపోవడానికి ఇది ఉత్తర భారతదేశం కాదని తమిళనాడు అని తమిళ ప్రజలు తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో హెచ్చరించారు.

మోడీ చరిత్రలో !

మోడీ చరిత్రలో !

నరేంద్ర మోడీ ప్రధాని అయిన తరువాత భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో లెక్కలేనన్ని పర్యటనలు చేశారు. ఇక విదేశీ పర్యటనలు విషయం సరేసరి. అయితే ప్రధాని హోదాలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నడూ చూడని నిరసన ఏప్రిల్ 12వ తేదీ గురువారం చెన్నైలో చూశారు.

నెంబర్ వన్ ట్రెండింగ్

నెంబర్ వన్ ట్రెండింగ్

మోడీ గో బ్యాక్ అనే నినాదాలు సోషల్ మీడియాలో భారత్ లో నెంబర్ 1గా, ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ 4 స్థానంలో ట్రెండింగ్ లో నిలిచింది. నిజంగా ప్రధానిగా మోడీకి ఏప్రిల్ 12వ తేదీ గురువారం బ్లాక్ డే అని, ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని తమిళ ప్రజలు అంటున్నారు.

కదలలేని కరుణానిధి

కదలలేని కరుణానిధి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి అనారోగ్యంతో కుర్చికే పరిమితం అయ్యారు. అలాంటి కరుణానిధి సైతం ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై పర్యటనను వ్యతిరేకిస్తూ నలుపు రంగు షర్టు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు.

తమిళనాడుకు రావద్దు

తమిళనాడుకు రావద్దు

గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీగారు కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యడం సాధ్యం కాదని మీరు భావిస్తే దయచేసి తమిళనాడులో మాత్రం అడుగుపెట్టరాదని కే. రామచంద్రన్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలు మోడీ గో బ్యాక్ అంటూ ట్వీట్ లు, రీట్వీట్ లు చెయ్యడంతో ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిలిచిపోయిందని మళ్లీ ట్వీట్ చేశారు.

మాతో రాజకీయాలు చేస్తే !

మాతో రాజకీయాలు చెయ్యాలని చూడకండి. తమిళనాడుకు, తమిళ న్రజలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మాకు ఓపిక నశించింది. తమిళ ప్రజలు కేవలం జాతీయ పార్టీలకే కాదు, తమిళనాడులోని ప్రాంతీయ పార్టీలుకు బుద్ది చెయ్యడానికి సిద్దం అయ్యారు. బుద్దిచెప్పిన తరువాత మాట్లాడుతాం అంటూ ఎస్. శ్రీనివాసన్ అనే యువకుడు ట్వీట్ చేశాడు.

ప్రధాని పదవికి అనర్హుడు

మోడీ వెనక్కి వెళ్లిపోండి. మీరు ప్రధాని పదవికి అనర్హుడు. మీరు మళ్లీ టీ అమ్మడం మొదలుపెట్టండి. మీరు టీ అమ్మడానికి కచ్చితంగా సరిపోతారు, ముందు ఆ పని చెయ్యండి అంటూ న్యానీస్ సరవణన్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.

ముళ్లును ముళ్లుతోనే తియ్యాలి

ముళ్లును ముళ్లుతోనే తియ్యాలి

మీ ప్రత్యర్థులను ఎదురుకోవడానికి మీరు (మోడీ) సోషల్ మీడియాను ఉప యోగించుకుంటారు. మీ మీద వ్యతిరేకతను తెలియజేయడానికి మేము సోషల్ మీడియానే ఉపయోగించాము, ముళ్లును ముళ్లు తోనే తియ్యాలి. చరిత్రలో 2018 ఏప్రిల్ 12వ తేదీ నిలిచిపోతుందని అద్వత్ అనే యువకుడు ట్వీట్ చేశాడు.

ముసలి కన్నీళ్లు నమ్మలేం

ముసలి కన్నీళ్లు నమ్మలేం

మోడీ ముసలి కన్నీళ్లు నమ్మడానికి ఇది ఉత్తర భారతదేశం కాదు, తమిళనాడు అంటూ నీనో అనే యువకుడు ట్వీట్ చేశాడు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యకుండా కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో లాభం పొందాలని మోడీ ప్రయత్నిస్తున్నారని తమిళ ప్రజలు ఆరోపిస్తున్నారు.

English summary
Prime Minister Narendra Modi was greeted with black flags and black balloons upon his arrival in Chennai on April 12th. The protestors expressing their rage against the Centre for not constituting the Cauvery Management Board (CMB). Go Back Modi hashtag is also trending on twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X