వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా వెనుక దేవుడు ఉన్నాడు, బీజేపీ కాదు, కావేరీ నీరు, సూపర్ స్టార్, హిమాలయాలు, రిటన్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాలను శాసించానలి చూస్తున్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హిమాలయా పర్వతాల్లో ఆధ్యాత్మిక పర్యటన ముగించుకుని మంగళవారం చెన్నై చేరుకున్నారు. తనను వెనుక నుంచి బీజేపీ నడిపిస్తోందని కొందరు విమర్శిస్తున్న విషయంపై రజనీకాంత్ ఘాటుగానే స్పంధించారు. తనను వెనుక నుంచి బీజేపీ నడిపించడం లేదని, తనను వెనుక నుంచి ఆ దేవుడు నడిపిస్తున్నాడని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు. కావేరీ నీటి పంపిణి విషయంలో రజనీకాంత్ వివరణ ఇచ్చారు.

 తన సత్తా తనకు తెలుసు

తన సత్తా తనకు తెలుసు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆడించినట్లు మీరు అడుతున్నారని, అందుకే రాజకీయాల్లోకి వస్తున్నారని పలువురు రాజకీయ నాయకులు ఆరోపణలపై మీరు ఏం సమాధానం చెబుతారు అని మీడియా ప్రశ్నించగా తన సత్తా తనకు తెలుసని, భగవంతుడు ఆడించినట్లు ఆడుతానే తప్పా ఎవరో ఆడించినట్లు తాను ఎందుకు ఆడుతానని రజనీకాంత్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

పెరియార్ విగ్రహం

పెరియార్ విగ్రహం

తమిళనాడులోని పుదుకోటై జిల్లాలో సోమవారం రాత్రి పెరియార్ విగ్రహం ద్వంసం చెయ్యడానికి కొందరు ప్రయత్నించిన విషయంపై సూపర్ స్టార్ రజనీకాంత్ మండిపడ్డారు. దేవుడి లాంటి పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చెయ్యాలనే ఆలోచన ఎలా వస్తోందని, అలాంటి పని చేసిన వారిని చూస్తూ వదిలిపెట్టకూడదని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రజనీకాంత్ డిమాండ్ చేశారు.

రామరాజ్య రథయాత్ర

రామరాజ్య రథయాత్ర

తమిళనాడులో రామరాజ్య రథయాత్ర ప్రవేశించిన విషయంపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పంధించారు. తమిళనాడు ప్రజలు శాంతియుతంగా ఉంటారని, అల్లర్లకు పాల్పడరని, రామరాజ్య రథయాత్ర సవ్యంగా కొనసాగడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తాను భావిస్తున్నానని రజనీకాంత్ అన్నారు.

 రాజకీయ పార్టీ ఎప్పుడంటే !

రాజకీయ పార్టీ ఎప్పుడంటే !

రాజకీయ పార్టీ ఎప్పుడు ప్రకటిస్తారు అని మీడియా ప్రశ్నించగా తన అభిమాన సంఘాలు, జిల్లా నాయకులతో మరోసారి సమావేశమై తుది నిర్ణయం ప్రకటిస్తానని రజనీకాంత్ వివరించారు. మరోసారి అభిమానులు, జిల్లా నాయకులతో చర్చించాల్సిన అవసరం ఉందని రజనీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కావేరీ నీరు, నా వ్యక్తిగతం

కావేరీ నీరు, నా వ్యక్తిగతం

కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని రజనీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. హిమాలయాల పర్యటన తన వ్యక్తిగతం అని, అక్కడికి వెళ్లి వచ్చిన తరువాత తనమైండ్ రీచార్జ్ అయ్యిందని, ఎంతో సంతోషంగా ఉందని సూపర్ స్టార్ రజనీకాంత్ వివరించారు.

English summary
Superstar Rajinikanth on Tuesday refuted reports and claims that the Bharatiya Janata Party was operating him from behind in his political moves. he said, Not the BJP, but God is behind me.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X