వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వామినిత్యానంద లైంగిక పటుత్వ పరీక్షలో కొత్త ట్విస్ట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కేసు మరో మలుపు తిరిగింది. మీడియా వర్గాల సమాచారం ప్రకారం, నిత్యానందకు రెండవ పురషత్వ పరీక్షను నిర్వహించేందుకు అమనుతి ఇవ్వాలని కర్ణాటక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ సిఐడీ ఆ రాష్ట్ర హైకోర్టును బుధవారం సంప్రదించింది.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో నలుగురు సభ్యుల బృందం నిత్యానందకు సోమవారం ఉదయం (సెప్టెంబర్ 8) పురుషత్వ పరీక్షను విక్టోరియా ఆస్పత్రిలో నిర్వహించారు. ఈ పరీక్షల్లో తాను నపుంసకుడినని, తనలో మగతనం లేదని పలు మార్లు చెప్పిన నిత్యానంద, ప్రపంచాన్ని తప్పుదోవపట్టించాడని నిర్థారణ అయింది. లైంగిక పరీక్షల్లో ఆయనకు లైంగిక సామర్థ్యం ఉన్నట్టు వెల్లడైంది.

Godman Nithyananda likely to go under 2nd potency test

సినీ నటి రంజితతో నిత్యానందకు శారీరక సంబంధాలున్నాయన్న వార్తలు అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నిత్యానంద మాజీ శిష్యురాలు ఒకరు నిత్యానంద తనను శారీరకంగా వేధించాడని తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2012లో కేసు నమోదు చేశారు.

ఈ వ్యవహారంలో నిత్యానందను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు నిత్యానంద దొరకలేదు. దీంతో, నిత్యానంద కేసు కోర్టుకు చేరింది. కేసును విచారించిన రామనగర సెషన్స్ కోర్టు నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి నిత్యానంద పైకోర్టుకు అప్పీల్ చేశాడు. తాను బాలుడితో సమానమని, తనకు సెక్స్ సామర్థ్యం లేదంటూ కోర్టుకు తెలిపాడు. ఐతే, జులై 28 నుంచి నిత్యానందను పోలీసులు కష్టడీలోకి తీసుకుని పురుషత్వ, రక్త తదితర పరీక్షలతో పాటు విచారణ కూడా చేయవచ్చునని హైకోర్టు తెలిపింది.

English summary
A latest twist in Nithyananda case amused many. According to sources, the self-styled godman might have to undergo another potency test in connection with the same rape case which has been hurled against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X