వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీ నటికి కుచ్చుటోపీ, అత్యాచారం: కస్టడీకి దొంగ బాబా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Godman was produced before a court and was remanded to police custody
ముంబై: టీవీ నటి పైన అత్యాచారం చేయడంతో పాటు ఆమె నుండి లక్షల డబ్బులు దండుకున్న ఆరోపణల పైన ఓ బాబాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు సదరు మంగళవారం బాబాను కోర్టు ఎదుట ప్రవేశ పెట్టారు. అతనిని మే 16వ తేదీ వరకు కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఖాసీం ఖాన్ పైన పోలీసులు సెక్షన్ 376(లైంగిక వేధింపు), 420(చీటింగ్) తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు.

పోలీసుల కథనం ప్రకారం... 35 ఏళ్ల వయస్సు గల ఇస్మాయిల్ ఖాసిం ఖాన్ అనే బాబాను పోలీసులు అరెస్టు చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.

ఇస్మాయిల్ ఖాసీం ఖాన్ అనే బాబా తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, అంతేకాకుండా తన వద్ద నుండి 25 లక్షల రూపాయలకు పైగా దండుకున్నారని 27 ఏళ్ల టీవీ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నానంటూ వస్తే.. స్వస్థత చేకూర్చుతానంటూ సదరు టీవీ నటికి చెప్పిన బాబా ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, డబ్బులు తీసుకున్నాడు.

మానసికంగా కృంగిపోయి తన వద్దకు వచ్చిన టీవీ నటికి.. నీకు దయ్యం పట్టిందని, దానిని వదిలించుతానని, అందుకోసం క్షుద్రపూజలు చేయాలని ఆమెతో చెప్పాటు. దీంతో ఆమె అతను చెప్పినట్లు చేసింది. ఈ క్రమంలో ఆమె నుండి ఖాసీం ఖాన్ రూ.25.70 లక్షలు కాజేశాడు. లైంగికంగా కూడా లోబరుచుకున్నాడు. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించిన ఆ టీవీ నటి చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో దొంగ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
Khan was produced before a court and was remanded to police custody till May 16. Khan has been booked under IPC sections 376 (Sexual Offences including rape) and 420 (Cheating), while Bhagwan Das has been booked for cheating, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X