వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ చేసిన తప్పు పాక్ కు సంతోషాన్నిచ్చింది: కట్జూ

భారత్ అనవసరంగా పాకిస్తాన్ కు అవకాశం ఇచ్చిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ అభిప్రాయపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ అనవసరంగా పాకిస్తాన్ కు అవకాశం ఇచ్చిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ అభిప్రాయపడ్డారు. కులభూషణ్ జాదవ్ కేసు విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి భారత్ పెద్ద తప్పు చేసిందన్నారు.

ఈ ఒక్క చర్యతో పాక్ ఆశల పేటిక తెరుచుకొందన్నారు. ఇక వారు భారత్ పై ప్రతిసారి ఐసీజె తలుపుతడుతారని చెప్పారు. భారత్ ఖచ్చితంగా సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

ఒక్క వ్యక్తి జీవితాన్ని కాపాడేందుకు భారత్ ఈ ప్రయత్నం చేస్తే ఇప్పుడు కశ్మీర్ వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలపై ఐసీజెకు వెళ్తామని ఆందోళన వ్యక్తం చేశారు.

Going to ICJ Over Kulbhushan Jadhav Was Serious Mistake:Katju

ఈ మేరకు ఫేస్ బుక్ లో కులభూషణ్ జాదవ్ కేసు , ఐజీజే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జాదవ్ కేసు విషయంలో ప్రపంచ న్యాయస్థానానికి వెళ్ళి చాలా తీవ్రమైన తప్పుచేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. బహుశా ఐసీజే తీర్పు విషయంలో చాలామంది సంబురాలు చేసుకొంటారు.

కానీ, నా అభిప్రాయంలో అది భారత్ చేసిన పెద్ద తప్పు. ఇది పాక్ చెప్పుచేతల్లో మనం ఆడుతున్పట్టు ఎన్నో విషయాలు ఐసీజే చేతుల్లో పెట్టినట్టు కశ్మీర్ విషయంలో ఏ అంతర్జాతీయ సంస్థను, వ్యక్తులను ఇప్పటివరకు అనుమతించని మనం ఇప్పుడు పాక్ ఐసీజేకు వెళితే జోక్యానికి అంగీకరించాల్సి వస్తోందన్నారు.

ఇది పాక్ ఆశ పేటీక తెరిచినట్టేనన్నారు. ఒక వ్యక్తి కోసం కశ్మీర్ వంటి సమస్యను కూడ ఐసీజేకు వెళ్ళేలా చేశారని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఇప్పడుు నాకు తెలిసి చాలా హ్యాపీగా ఉంటుందని కట్జూ ఫేస్ బుక్ లో రాశారు.

English summary
Former Supreme Court judge Markandey Katju has said that India may have opened “Pandora’s box” by going to the International Court of Justice against the death penalty handed to Kulbhushan Jadhav by Pakistan’s military.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X