Gold Smuggling: పొలిటికల్ లీడర్ కొంప ముంచేసిన స్వప్న అండ్ టీమ్, విదేశాల్లో ఏం చేశారంటే ?, డాలర్స్ !
కొచ్చి/ కేరళ/ దుబాయ్: కేరళ గోల్డ్ స్మగ్లింగ్, డాలర్స్ స్కామ్ కేసుల వ్యవహారం ఆ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన నాయకుడి మెడకు చుట్టుకునే అవకాశం ఉందని వెలుగు చూసింది. యూఏఇ నుంచి సరఫరా అవుతున్న గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన స్వప్న మేడమ్ అలియాస్ స్వప్న సురేష్, ఇదే కేసులో అరెస్టు అయిన సరిత్, సందీప్ నాయర్ లు డాలర్స్ స్కామ్ కేసులో ఓ రాజకీయ నాయకుడి కొంప ముంచడానికి సిద్దం అయ్యారని తెలిసింది. ఆ పొలిటికల్ లీడర్ విదేశాల్లో విశ్వవిద్యాలయం ప్రారంభించడానికి డాలర్ల స్కామ్ జరిగిందని స్వప్న, సరిత్, సందీప్ నాయర్ లు కోర్టుకు, అధికారులకు రహస్యంగా సమాచారం ఇచ్చారని ఓ ప్రముఖ మలయాళం పత్రిక కథనం ప్రచురించింది. స్వప్న, సరిత్, సందీప్ నాయర్ లు ఇచ్చిన సమాచారం మేరకు ఆ పొలిటికల్ లీడర్ విమానాల్లో ఎప్పుడెప్పుడు విదేశాలకు వెళ్లి వచ్చారు ? అనే వివరాలు సేకరిస్తున్నారని సమాచారం.
Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!

స్వప్న, సరిత్ సీక్రెట్స్
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన స్వప్న సురేష్, ఆమె అనుచరుడు సరిత్ తో పాటు మిగిలిన నిందితులు ప్రస్తుతం కొచ్చిలోని సెంట్రల్ జైలులో ఉంటున్నారు. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి మేము కొన్ని రహస్యాలు కోర్టులో చెప్పాలనుకుంటున్నామని దర్యాప్తు సంస్థల అధికారులకు స్వప్న సురేష్, సరిత్ లు చెప్పారు. స్వప్న సురేష్, సరిత్ వారు చెప్పాలనుకున్న రహస్యాలను వారి న్యాయవాదుల సహకారంతో తెలియజేయాలని ప్రత్యేక కోర్టు సూచించింది.

సీల్డ్ కవర్ లో సీక్రెట్ స్టేట్ మెంట్
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ తో పాటు ఈ కేసులో అరెస్టు అయిన వారికి సంబంధాలు ఉన్నాయని అధికారులు గట్టిగా చెబుతున్నారు. ఇదే సమయంలో స్వప్న సురేష్, సరిత్ లు వారి న్యాయవాదుల సహాయంతో రహస్య సమాచారాన్ని కోర్టుకు తెలియజేశారు. స్వప్న సురేష్, సరిత్ ల స్టేట్ మెంట్ ను వారి న్యాయవాదులు సీల్డ్ కవర్ లో కోర్టులో సమర్పించారు.

బాంబు పేల్చిన సందీప్ నాయర్
స్వప్న సురేష్, సరిత్ లు వారి న్యాయవాదుల సహాయంతో రహస్య సమాచారాన్ని కోర్టుకు తెలియజేసిన తరువాత ఇదే కేసులో అరెస్టు అయిన సందీప్ నాయర్ సైతం అనేక రహస్యాలు బయటకు చెప్పాడని తెలిసింది. తెలిసో తెలీకో తాను బంగారు స్మగ్లింగ్ కేసుతో పాటు డాలర్ల స్కామ్ కు సహకరించానని, తనను క్షమిస్తే జరిగిన కథ మొత్తం చెబుతానని ఎన్ఐఏ కోర్టులో రహస్యంగా స్టేట్ మెంట్ ఇచ్చారని ప్రముఖ మలయాళం పత్రిక కథనం ప్రచురించింది.

గోల్డ్ స్మగ్లింగ్+ డాలర్ల స్కామ్
యూఏఇ నుంచి కేరళకు బంగారు స్మగ్లింగ్ సరఫరా చెయ్యడమే కాకుండా కేరళ నుంచి భారీ మొత్తంలో విదేశాలకు డాలర్ల రూపంలో నగదు బదిలి అయ్యిందని కస్టమ్స్, ఈడీ, ఎన్ఐఏ అధికారుల విచారణలో బయటపడింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన స్వప్న సురేష్ కు డాలర్ల స్కామ్ తో సంబంధాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

అధికార పార్టీ లీడర్
కేరళకు చెందిన వామపక్ష పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు విదేశాల్లో విశ్వవిద్యాలయం (యూనివర్శిటి) పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయనకు ఓ మలయాళీ కూడా పూర్తి సహకారం అందించారని, అందుకే డాలర్ల స్కామ్ కు తాము సహకరించామని స్వప్న సురేష్, సరిత్ లు వేర్వేరుగా స్టేట్ మెంట్ ఇచ్చారని తెలిసింది.

లీడర్ కొంప ముంచేశారా ?
కేరళకు చెందిన ఆ పొలిటికల్ లీడర్ భాగోతం గురించి సందీప్ నాయర్ కూడా ప్రత్యేకంగా స్టేట్ మెంట్ ఇచ్చాడని వెలుగు చూడటంతో కేరళలోని అధికార పార్టీ నాయకులు హడలిపోయారు. స్వప్న సురేష్, సరిత్, సందీప్ నాయర్ లు ఇచ్చిన సమాచారం మేరకు కేరళకు చెందిన ఆ పొలిటికల్ లీడర్ ఎప్పుడెప్పుడు విమానాల్లో విదేశాలకు వెళ్లి వచ్చారు ? అంటూ పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారని తెలిసింది.

కస్టమ్స్, ఈడీ ఆఫీసర్స్
ఆ పొలిటికల్ లీడర్ సహకారంతో స్వప్న సురేష్, సరిత్, సందీప్ నాయర్ లకు విమానాశ్రాయల్లో వీఐపీ ట్రీట్ మెంట్ ఇచ్చారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో పాటు డాలర్ల స్కామ్ కేసును ఈడీ, కస్టమ్స్ అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంత వరకు కస్టమ్స్, ఈడీ అధికారుల నుంచి స్వప్న, సరిత్, సందీప్ నాయర్ లు చెప్పిన వివరాలు అధికారికంగా బయటకు రాలేదు.