వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Today gold price: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాలు, డిమాండ్ లేమితో తాజాగా బంగారం ధర భారీగా దిగివచ్చింది. మంగళవారం కూడా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బుధవారం కూడా క్షీణతను నమోదు చేశాయి.

40వేల దిగువకు బంగారం ధర..

40వేల దిగువకు బంగారం ధర..

బుధవారం రూ. 301 తగ్గడంతో బంగారం ధర మళ్లీ రూ. 39వేల దిగువకు పడిపోయింది. దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ. 38,870గా ఉంది. మరోవైపు వెండి కూడా బంగారం దారిలోనే నడుస్తోంది.

వెండి ధర కూడా భారీగానే తగ్గింది..

వెండి ధర కూడా భారీగానే తగ్గింది..

పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు, డిమాండ్ లేకపోవడంతో బుధవారం ఒక్కరోజే రూ. 906 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ. 46,509 పలికింది. మంగళవారం మాత్రం వెండి ధర స్థిరంగా ఉన్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ మార్కెట్లో..

హైదరాబాద్ మార్కెట్లో..

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 39,540గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 39,540 పలికింది. విజయవాడలో కూడా దాదాపు ఇదే ధర కొనసాగుతోంది.

క్షీణతకు గల కారణాలు..

క్షీణతకు గల కారణాలు..

రూపాయి మారకం క్షీణత, అమెరికా-చైనా మధ్య త్వరలో వాణిజ్య చర్చలు జరగనున్నట్లు వస్తున్న వార్తలతో అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒత్తిడికి గురవుతున్నాయి. దీనికితోడు దేశీయంగా కూడా బంగారం డిమాండ్ తగ్గడం కూడా మార్కెట్లలో బంగారం, వెండి ధరల క్షీణతకు కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.

నిన్నటి ధరలు ఇలా..

నిన్నటి ధరలు ఇలా..

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 40 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 40,370కి క్షీణించింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 40 తగ్గింది. దీంతో 10 గ్రాముల ఈ బంగారం ధర రూ. 37,010కు పడిపోయింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు దాదాపు ఇలానే ఉన్నాయి. ఓ వైపు బంగారం ధర స్వల్పంగా తగ్గినప్పటికీ.. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 48,750 వద్ద నిలకడగా ఉంది.

English summary
Gold and Silver prices fell down on Wednesday market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X