విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Gold Rates:పండగవేళ "బంగారం" లాంటి న్యూస్..దిగొచ్చిన పసిడి ధరలు..!

|
Google Oneindia TeluguNews

ముంబై: భారత్‌లో బంగారం మరియు వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కొద్ది రోజులుగా క్రమంగా పసిడి ధరలు తగ్గుతూ వస్తుండటంతో కొనుగోలు దారుల్లో బంగారం కొనాలన్న ఉత్సాహం కనిపిస్తోంది. బంగారం మరియు వెండి ధరలు రెండు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ. 49,293కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రూ.610కి తగ్గి రూ.51810కి చేరుకున్నాయి. ఇక కిలో వెండి రూ. 59,500గా ఉంది. కిలోకు రూ.1100 మేరా వెండి ధర తగ్గింది.

దేశవ్యాప్తంగా పసిడి ధరలు

దేశవ్యాప్తంగా పసిడి ధరలు

ఢిల్లీలో కూడా పసిడి ధరలు తగ్గిపోయాయి. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.500 తగ్గి రూ. 49,000కు చేరుకోగా... 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం రూ.53,460 వద్ద చేరింది. ఇక చెన్నైలో బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 760 తగ్గి రూ.52,470కి చేరింది. ఇక కోల్‌కతాలో బంగారం ధరలు పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 49,380గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం 52,080గా ఉంది. రూ.360 ఇక్కడ తగ్గింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మాత్రం రూ.620 తగ్గి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 49,010గా ఉండగా... 24 క్యారెట్ బంగారం రూ.50,010గా ఉంది.

హైదరాబాదు, విజయవాడ, విశాపట్నంలో...

హైదరాబాదు, విజయవాడ, విశాపట్నంలో...

ఇక హైదరాబాదులో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం రూ.590 మేరా పడిపోయి రూ.53,230కు చేరింది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 మేరా తగ్గి 47,550గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 మేరా తగ్గి 51,870కి చేరింది. ఇక విజయవాడలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.47,550గా ఉండగా 24 క్యారెట్ కూడా రూ.51,870గా ఉంది. ఇక పండగ వేళ ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. మహిళలు ఇప్పుడే బంగారంను కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే భవిష్యత్తులో బంగారం రూ.60వేల మార్కును టచ్ చేసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.

బంగారం ధరలు ఎందుకు తగ్గుతాయి..?

బంగారం ధరలు ఎందుకు తగ్గుతాయి..?

మొత్తానికి ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు ప్రతి గంటకూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో చోటుచేసుకుంటున్న ఆర్థిక మరియు రాజకీయ పరిణామాల ప్రభావం బంగారం ధరలపై చూపుతుంది.అంతేకాదు ఆయా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటే కూడా ప్రతి నిమిషం ఆ ప్రభావం బంగారం ధరలపై కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే కరోనావైరస్‌ కూడా బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిందని చెబుతున్నారు విశ్లేషకులు. ఆసియా దేశాల్లో పసిడి ధరలు క్షీణించడానికి కారణం ఎక్కువ డిమాండ్ లేకపోవడమే అని చెబుతున్నారు. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కృంగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని భావిస్తున్నారు. అయితే ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు తీసుకునే నిర్ణయాలపై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఇక భారత్ విషయానికొస్తే ఎక్సైస్ డ్యూటీ, రాష్ట్రాలు విధించే పన్నులు సుకం, మేకింగ్ ఛార్జీలతోనే బంగారం ధరలు మారుతూ ఉంటాయి.

English summary
The gold rates on Thursday have fell in Indian markets with a fall in global rates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X