వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తగ్గిన బంగారం వెండి ధరలు,ధరలు ఎందుకు తగ్గాయంటే, ఇంకా తగ్గుతాయా ?

అంతర్జాతీయ మార్కెట్ తో పాటు దేశీయ మార్కెట్ లో కూడ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పదిన్నర నెలల కనిష్టస్థాయికి ధరలు పడిపోయాయి. ఇంకా ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరో వైపు య

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి.దేశీయ మార్కెట్లో బంగారం , వెండి ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడంతో దేశీయంగా ఇన్వెష్టర్లు, స్టాకిస్టులు అమ్మకాలకు దిగడం వంటి పరిణామాలతో బంగారం వెండి ధరలు తగ్గాయి.

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం, దేశీయంగా ఇన్వెస్టర్లు స్టాకిస్టులు అమ్మకాలకు దిగడంతో బంగారంచ వెండి ధరలు తగ్గిపోయాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముంబై బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర 1,410 రూపాయాలకు తగ్గింది, దీంతో వెండి కిలో 41 వేల రూపాయాలకు చేరింది.

 gold bounces from ten month low before fed reserve decission

మరో వైపు 99.9 శాతం స్వచ్చత కలిగిన పది గ్రాముల బంగారం ధర 550 రూపాయాలు తగ్గింది, దీంతో బంగారం గ్రాము ధర 28,050 రూపాయాల నుండి 27,500 రూపాయాలకు పడిపోయింది.99.5 శాతం స్వచ్చత ఉన్న పసిడి ధర కూడ తగ్గింది. 27,900 రూపాయాల నుండి 27,350 రూపాయాలకు దీని ధర పడిపోయింది.

అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధర తగ్గిపోయింది. ఔన్స్ బంగారం ధర పదిన్నర నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. పదిన్నర నెలల కనిష్టస్థాయిలో 1,132 .15 డాటర్లకు చేరుకొంది. ఏడాదిలో తొలిసారిగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచింది. వచ్చే ఏడాది మరింతగా వడ్డీరేట్లను పెంచవచ్చనే సంకేతాలను కూడ ఇచ్చింది.దరిమిలా బులియన్ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకానుంది. బంగారం ధరలు రాను్న కాలంలో మరింత తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

English summary
gold bounced from its lowest close in tne months as traders hedge against any potential srprise from the us federal reserve's meeting where policy makers are expected to increase interest rates for the first time this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X