వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవాలయం సమీపంలో తవ్వకాలు: 505 బంగారు నాణేలు లభ్యం

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని ఓ దేవాలయం పరిసరాల్లో జరిగిన తవ్వకాల్లో 505 బంగారు నాణేలు లభించాయి. ఈ బంగారు నాణేల మొత్తం బరువు 1.716 కిలోలుగా ఉంది. తమిళనాడులోని తిరువనైకావల్‌లో ఉన్న జంబుకేశ్వరర్ దేవాలయంలో బుధవారం జరిపిన తవ్వకాల్లో ఈ నాణేలు బయటపడ్డాయి.

ఈ మొత్తం నాణేల్లో 504 చిన్నవి కాగా, ఒకటి మాత్రం పెద్దగా ఉందని ఆలయ అధికారులు తెలిపారు. క్రీస్తుశకం 1000 నుంచి 1200కు చెందినవిగా అంచనా వేస్తున్నారు.

Gold coins weighing 1.7 kg found in digging near a temple in tamil nadu

దేవాలయం పరిసరాల్లో తవ్వకాలు జరుపుతుండగా ఏడు అడుగుల లోతులో ఓ మట్టి పాత్రలో ఈ నాణేలు లభించాయని ఆలయ అధికారులు తెలిపారు. పాత్రతో సహా బంగారు నాణేలను పోలీసులకు అప్పగించినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం వీటిని ప్రభుత్వ ట్రెజరీకి తరలించి తదుపరి దర్యాప్తు చేపడుతున్నారు.

English summary
As many as 505 gold coins weighing 1.716 kilograms were found in a vessel while digging near the Jambukeswarar Temple in Thiruvanaikaval here on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X