వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown:ఫస్ట్ ప్రైజ్ బంగారం, సెకండ్, థర్డ్.. ప్రీజ్, వాషింగ్ మిషన్, కాంప్లిమెంటరీ కూడా, ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు విధించిన లాక్‌డౌన్ తు.చ తప్పకుండా పాటించేందుకు ఆ గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంది. నిబంధనలను పాటించిన వారికి బంగారం, ఫ్రీజ్ ఇతర బహుమతులను అందజేస్తామని ప్రకటించింది. మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ ఉండటంతో.. తర్వాత లక్కీ డ్రా ద్వారా తీసి ప్రైజ్ అందజేస్తామని పంచాయతీ తెలిపింది.

బహుమతులు..

బహుమతులు..

కేరళ మలప్పురం జిల్లాలో గల తజికొడ్ గ్రామంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించిన వారికి బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. మార్చి 24వ తేదీ నుంచి లాక్ డౌన్ అమల్లోకి రాగా... గ్రామ పంచాయతీలో ఈ నెల 6వ తేదీన చర్చించి.. నిర్ణయం తీసుకున్నామని పంచాయతీ ప్రెసిడెంట్ ఏకే నజర్ పేర్కొన్నారు. నిబంధనలు పాటించిన వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్, 50 కాంప్లిమెంటరీ ప్రైజులు కూడా అందజేస్తారు.

బంగారం, ప్రీజ్..

బంగారం, ప్రీజ్..

మొదటి ఫ్రైజ్ బంగారం, రెండో బహుమతి రిఫ్రిజిరేటర్, మూడో బహుమతి వాషింగ్ మిషన్ అందజేస్తామని పేర్కొన్నారు. వీరితోపాటు 50 మందికి కాంప్లిమెంటరీ బహుమతులు కూడా అందజేస్తామని తెలిపారు. గ్రామంలో 10 వేల మంది ఉంటారని... అందరూ సురక్షితంగా ఉండాలంటే ఇంట్లోనే ఉండాలని నజర్ తెలిపారు. అందుకోసమే బహుమతులను ప్రకటించామని.. ఇంట్లోనే ఉండేవారికి ప్రైజ్ అందజేస్తామని చెప్పారు.

లాటరీ ద్వారా..

లాటరీ ద్వారా..

లాక్‌డౌన్ మే 3వ తేదీ తర్వాత ముగిసిన తర్వాత బహుమతులను అందజేస్తామని పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఎవరూ ఉన్నారని పరిశీలించేందుకు కొందరినీ ఏర్పాటు చేశామని నజర్ తెలిపారు. వారు నిత్యం పరిశీలించి.. నివేదిక అందజేస్తారని... దానిని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఇంటింటికీ కూపన్లు అందజేస్తామని.. తర్వాత వాటిని తీసి విజేతలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. గ్రామంలో చేపట్టిన వినూత్న విధానం మిగతావారికి ఆదర్శంగా నిలుస్తోంది.

Recommended Video

Coronavirus : COVID-19 Cases Crossed 1,332 Mark In AP With 73 New Cases
19 మంది సేఫ్..

19 మంది సేఫ్..

మలప్పురం జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం తక్కువే ఉంది. ఒకరు మాత్రమే వైరస్ సోకి చికిత్స తీసుకుంటున్నారు. 21 మందికి వైరస్ సోకగా.. 19 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఒకరు చనిపోయారని.. కానీ అతను ఇతర వ్యాధి వల్ల మృతిచెందాడని తెలిసింది. వైరస్ సోకి 4 నెలల చిన్నారి చనిపోయిన సంగతి తెలిసిందే.

English summary
first prize - half a sovereign of gold, second prize - a refrigerator, third prize - a washing machine and 50 complimentary prizes would be given when the lockdown ends, promised the kerala panchayat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X