వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

today gold price: భారీగా తగ్గిన బంగారం ధరలు, వెండి కూడా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఖచ్చితంగా శుభవార్తే. ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గాయి. బంగారం ధర బలహీన ట్రెండ్ కొనసాగడంతో బుధవారం బంగారం ధర భారీగా పడిపోయింది.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, వెండి ధర కూడాస్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, వెండి ధర కూడా

రూ. 37వేలకు

రూ. 37వేలకు

అంతర్జాతీయంగా మార్కెట్లో బంగారం ధర క్షీణించడం సహా అమెరికా డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ బలపడటంతో దేశీయంగా బంగారం ధరపై ప్రభావం పడింది. ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ధర బుధవారం 0.20 శాతం తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 37,647కు తగ్గింది.

రూ. 2,350 తగ్గింది.. వెండి కూడా

రూ. 2,350 తగ్గింది.. వెండి కూడా

సెప్టెంబర్ నెల ఆరంభంలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 40,000 చేరుకున్న విషయం తెలిసిందే. అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర ఏకంగా రూ. 2, 350 పడిపోయింది. వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండి ధర రూ. 0.40శాతం క్షీణించడంతో రూ. 44,262కు తగ్గింది.

గతంలోనే బాగా పెరిగింది కానీ..

గతంలోనే బాగా పెరిగింది కానీ..

దేశీయ మార్కెట్లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 19శాతం పెరుగుదల నమోదు చేసింది. సెప్టెంబర్ నెల ఆరంభంలో బంగారం ధర ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాములకు ఏకంగా రూ. 40,000 మార్క్ పైకి చేరింది. వెండి ధర కూడా కిలోకు రూ. 50వేల మార్క్‌కు ఎగిసింది. అయితే, మళ్లీ బంగారం ధర ఆ స్థాయికి చేరకపోవడం గమనార్హం.

బంగారం ధరలపై ప్రభావం ఇలా..

బంగారం ధరలపై ప్రభావం ఇలా..

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 0.10 శాతం పడిపోవడంతో ఔన్స్‌కు 1459.91 డాలర్లకు దిగొచ్చింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి సానుకూలతలు రావడంతో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు కూడా ర్యాలీ చేస్తున్నాయి. దీంతో బంగారంపై ప్రతికూల ప్రభావం పడింది. అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్ల కోతకు సుముఖంగా లేకపోవడం కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతోంది.

చైనాలో తగ్గిన బంగారం దిగుమతులు

చైనాలో తగ్గిన బంగారం దిగుమతులు


కాగా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల బంగారం ధరకు కింది స్థాయిల్లో మద్దతు
లభించే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చైనాలో బంగారం
దిగుమతులు 2017 జనవరి నాటికి కనిష్టస్థాయికి పడిపోయాయి. ప్రపంచంలో చైనా తర్వాత బంగారం ఎక్కువగా వినియోగిస్తున్న దేశం ఇండియానే. వృద్ధి రేటు భయాలు, ద్రవ్యోల్బణ పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో చైనాలో పసిడి దిగుమతులు తగ్గాయి.

English summary
Gold prices in India were weak today, falling for the seventh day in a row. A decline in global rates and the recent appreciation in rupee has put pressure on domestic gold prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X