వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Today gold price: మూడు నెలల కనిష్టానికి బంగారం ధరలు, వెండి కూడా

|
Google Oneindia TeluguNews

ముంబై: బంగారం ధరలు మరోసారి దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మూడు నెలల కనిష్టానికి పడిపోవడం గమనార్హం. స్పాట్ గోల్డ్ బంగారం ధర శుక్రవారం ఔన్స్‌కు 1455.8 డాలర్లకు పడిపోయింది. ఆగస్టు నెల తర్వాత ఈ స్థాయిలో ధరలు తగ్గడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

బంగారం ధరలపై ఒత్తిడి..

బంగారం ధరలపై ఒత్తిడి..

యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర కూడా 0.2శాతం తగ్గడంతో ఔన్స్‌కు 1462.9 డాలర్లకు పడిపోయింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందాలు తిరిగి కుదరొచ్చనే అంచానలతో బంగారం ధరలపై ఒత్తిడి పెంచాయి. కొద్ది రోజులుగా స్థిరంగా ఉంటున్న వెండి ధరలు కూడా తగ్గాయి. వెండి ధర 1.2శాతం క్షీణించడంతో ఔన్స్‌కు 16.9 డాలర్లకు పడిపోయింది.

సానుకూల ప్రభావం

సానుకూల ప్రభావం

కాగా, అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదిరితే.. ఆ తర్వాత అమెరికా చైనా దిగుమతులపై టారిఫ్‌లను ఎత్తివేసే అవకాశం ఉంది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ డీల్ ఇంకా కుదరలేదని చెప్పడం గమనార్హం.
ఇది బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

వాణిజ్య యుద్ధంతో..

వాణిజ్య యుద్ధంతో..


అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఏడాది బంగారం ధర 14 శాతానికిపైగా పెరగడానికి అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధమే కారణం కావడం గమనార్హం. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమన పరిస్థితులక నేపథ్యంలో సురక్షిత పెట్టుబడుల సాధనమైన బంగారం డిమాండ్ పెరగడం ప్రారంభమైంది.

రేట్ల కోతతో..

రేట్ల కోతతో..

ఇది ఇలావుంటే, అమెరికా ఫెడరల్ రిజర్వు తాజాగా వడ్డీ రేటును తగ్గించడం కూడా బంగారం ధరకు సానుకూలంగా మారింది. అయితే, ఆ తర్వాత రేట్ల కోత ఉండదని, ఆర్థిక వ్యవస్థ డౌన్ టర్న్ తీసుకుంటేనే రేట్ల కోత అంశం గురించి ఆలోచిస్తామని ఫెడరల్ రిజర్వే పేర్కొనడం బంగారం ధరపై ఒత్తిడిని పెంచింది.

దేశీయంగా.. రూ. 40వేలకు దిగువనే బంగారం..

దేశీయంగా.. రూ. 40వేలకు దిగువనే బంగారం..

ఇక దేశీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఎంసీఎక్స్ మార్కెట్లో శుక్రవారం 0.28శాతం పెరుగుదలతో 10 గ్రాముల బంగారం ధర 37,682కు చేరింది. కాగా, బంగారం ధర సెప్టెంబర్‌లో నెల ప్రారంభంలో రూ.40,000కు చేరుకుంది. అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు బంగారం ధర రూ. 2000 దిగువనే ఉండటం గమనార్హం. వెండి ధర కూడా 0.50శాతం తగ్గి కిలోకు రూ. 43,950గా ఉంది.

English summary
Gold prices in global markets fell to a three-month low on Friday. Spot gold fell to $1,455.80, its lowest since August 5. US gold futures settled down 0.2% at $1,462.90.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X