వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: భారీగా క్షీణించిన బంగారం ధరలు, స్థిరంగా వెండి

|
Google Oneindia TeluguNews

బంగారం కొనాలనుకునేవారికి ఇదే సరైన సమయం. ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1950 తగ్గింది. దీంతో ధర రూ. 38.062కు పడిపోయింది. గత నెలలో రూ. 40,000 ఉండగా ఇప్పుడు రికార్డు స్థాయిలో ధరలు క్షీణించాయి. హైదరాబాద్ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి.

కాగా, 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 120 తగ్గింది. దీంతో బంగారం ధర రూ. 36,600కు పడిపోయింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెల్లర్ల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధర క్షీణిస్తోందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Gold prices fall today, down ₹1,950 per 10 gram from last months highs

ఇక ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం ధర పడిపోయింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గింది. దీంతో ధర రూ. 38,650కు క్షీణించింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై కూడా రూ. 50 తగ్గింది. దీంతో ఈ బంగారం ధర రూ. 37,450కు క్షీణించింది. బంగారం ధర భారీగా తగ్గినప్పటికీ.. వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతోంది.

కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పులేదు. దీంతో వెండి ధర రూ. 47,500 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు దాదాపు ఇలానే కొనసాగుతున్నాయి. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్లు మందగించడంతో ఈ ధరలు కొనసాగుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయం మార్కెట్లోనూ బంగారం ధర దిగొచ్చింది. ఔన్స్ ధర 0.16శాతం తగ్గడంతో 1,495.15 డాలర్లకు క్షీణించింది. కాగా, గత కొంత కాలంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. డిమాండ్ మందగించిన కారణంగా ఇలా జరుగుతోందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

English summary
Gold price in India slipped today, extending their choppy movement seen over past few weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X