వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పై పైకి పసిడి, ఏడేళ్ల గరిష్టానికి బంగారం, కరోనా, నిరుద్యోగిత, ఆర్థిక వ్యవస్థే కారణం..

|
Google Oneindia TeluguNews

బంగారం ధర పై పై కి వెళుతోంది. ఏడేళ్ల గరిష్టానికి పసిడి ధర చేరింది. నిరుద్యోగ ప్రయోజనాల కోసం అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న చర్యలు బంగారం ధర పెరగడానికి దారితీస్తోంది.

మాంద్యానికి కరోనా వైరస్ తోడవడంతో అమెరికాలో నిరుద్యోగిత కూడా పెరుగుతోంది. దీనిని అధిగమించేందుకు అమెరికా ఉద్దీపన చర్యలు తీసుకుంటుంది. మాంద్యంతో ఈక్విటీలు పెరిగిన.. పెట్టుబడిదారులు ఆర్థిక మందగమనానికి వ్యతిరేకంగా బీమా చేయాలని ప్రతిపాదించడం వల్ల 2012 నుంచి బంగారం లోహం అంతగా లభించడం లేదు. ద్రవ్య, ఆర్థిక ఉద్దీపన, ప్రతీకూల దిగుబడి అప్పు, ఎక్కువకాలం వడ్డీ రేట్లు బంగారాన్ని ఆకర్షించడాన్ని కొనసాగిస్తోందని స్టాండర్డ్ చార్టర్డ్ పీఎల్‌సీలోని లోహాల విశ్లేషకుడు సుకి కూపర్ తెలిపారు.

Gold prices jump to seven-year high..

జూన్ నాటికి బంగారం న్యూయార్క్‌లోని కమెక్స్‌లో 4 శాతం పెరిగి 1752.80 డాలర్లకు చేరుకుంది. ఇది అక్టోబర్ 2012 ముగింపు ధర కావడం విశేషం. వారంలో బంగారం ధర 6.5 శాతం పెరిగింది. గురువారం ఒక్కరోజే ఔన్స్ బంగారం 2.2 శాతం పెరిగి 1681.94 డాలర్లకు చేరింది. కరోనా వైరస్ వల్ల బంగారం రవాణా కూడా కష్టమవడంతో.. ధర పెరగడానికి మరో కారణం అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆంక్షలు ఎప్పడు ఎత్తివేస్తారనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. దీంతో బంగారం సరఫరా కావడం లేదు. డిమాండ్ ఉన్న సప్లై లేకపోవడంతో.. ధర పెరిగేందుకు కారణమవుతూ వస్తోంది.

English summary
Gold reached a seven-year high as massive U.S. filings for jobless benefits and sweeping steps by the Federal Reserve to shore up the economy bolstered demand for the metal as a haven
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X