వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Today gold price: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, వెండి ధర కూడా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నప్పటికీ దేశీయ జువెల్లర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ మార్కెట్లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 39,860కు క్షీణించింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 40 తగ్గింది. దీంతో ధర రూ. 36,540కు పడిపోయింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు దాదాపు ఇలానే ఉన్నాయి.

దేశీయంగానూ..

దేశీయంగానూ..

బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా తగ్గింది. ఏకంగా రూ. 965 పతనమైంది. దీంతో కిలో వెండి ధర రూ. 46,900కి పడిపోయింది. ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గడంతో రూ. 38,500కు పతనమైంది. ఇక 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 50 తగ్గింది. దీంతో రూ. 37,300లకు తగ్గింది.

బంగారం బాటలోనే వెండి..

బంగారం బాటలోనే వెండి..

వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. కిలో వెండి ధర రూ. 965 తగ్గింది. దీంతో ధర రూ. 46,900కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఔన్స్‌కు 0.03శాతం

పెరుగుదలతో 1,474.55 డాలర్లకు చేరింది. ఇక వెండి ధర ఔన్స్‌కు 0.04శాతం పెరుగుదలతో 17.12 డాలర్లకు పెరిగింది.

ప్రభావం చూపుతున్న అంశాలు..

ప్రభావం చూపుతున్న అంశాలు..

కాగా, బంగారం ధర అక్టోబర్ నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్టస్థాయి ఔన్స్‌కు 1550 డాలర్లకు చేరింది. బంగారం ధరలు పెరుగుదల, తగ్గుదలపై అంతర్జాతీయ అంశాలతోపాటు ఇతర అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీరేట్లు, జువెల్లరీ మార్కెట్ల డిమాండ్, వాణిజ్య ఒప్పందాల్లో మార్పులు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

English summary
Gold prices remained weak in India today, tracking muted global rates. On MCX, prices of gold futures contracts were flat at ₹38,169 per 10 gram. Despite the recent uptick, gold still remains down about ₹1,800 per 10 gram from September highs of about ₹40,000 per 10 gram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X