వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన బంగారం ధరలు..అదే బాటలో వెండి కూడా..!

|
Google Oneindia TeluguNews

గత కొద్ది రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శనివారం రోజున ఒక్కసారిగా పడిపోయాయి. కొన్ని రోజులుగా మార్కెట్లను ఒక ఆట ఆడుకున్న పుత్తడి ధరలు శనివారం మాత్రం దిగొచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర 0.14 శాతం తగ్గి రూ.37,740కి చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గిపోయాయి. కిలో వెండి ధర 0.24శాతం తగ్గి రూ. 46,267కు చేరుకుంది.

తగ్గిన బంగారం ధర

తగ్గిన బంగారం ధర

మొత్తంగా నిన్నటి వరకు 10 గ్రాముల బంగారం ధర రూ.39,885గా ఉండగా శనివారం రోజుకు అది రూ. 2150కి తగ్గి రూ. 37,740కి చేరింది. ఇక వెండి ధర రూ. 51,489గా ఉండగా శనివారం రోజున రూ.5,220 తగ్గి రూ. 46,267కు చేరింది. గత కొన్ని వారాలుగా ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలో స్థిరత్వం లేకుండా ఉంది. ఒకానొక సమయంలో గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,506.25 డాలర్లుగా ఉంది.

మోనిటరీ పాలసీలపై అనుకూల ప్రకటన

మోనిటరీ పాలసీలపై అనుకూల ప్రకటన

ఇక ఆయా దేశాలు తమ మోనిటరీ పాలసీలపై అనుకూల ప్రకటనలు చేయడంతో ప్రపంచ మార్కట్లో బంగారం ధరలు తగ్గి ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బిజినెస్ అనలిస్టులు. ప్రస్తుతం అమెరికాలో రాజకీయాలు స్థిరంగా లేకపోవడం ట్రంప్‌పై అభిశంసన తీర్మానం వంటి వార్తలు వస్తుండటంతో ఆ ప్రభావం పసిడి ధరలపై పడిందని అనలిస్టులు చెబుతున్నారు.

పండగ ముందు గుడ్ న్యూస్

పండగ ముందు గుడ్ న్యూస్


ప్రపంచ మార్కెట్లలో వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం జరిగి అవకాశాలుంటే వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అనలిస్టులు వెల్లడించారు. ఇదిలా ఉంటే పండగ సీజన్‌కు ముందు ఇలా బంగారం ధరలు దిగి రావడం శుభపరిణామం అని కస్టమర్లు చెబుతున్నారు. శనివారంతో పితృపక్షం ముగిస్తే బంగారం కొనుగోళ్లు పెరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల మధ్య బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే ఈ మాసాల మధ్య దసరా, దీపావళితో పాటు వివాహాలు కూడా జరుగుతున్నందున పసిడి కొనుగోళ్లు ఎక్కువగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

English summary
Gold price had dipped to its low on Saturday. There was fall of Rs.2150 where 10grams of gold stands at Rs.37,740.Simultaneously the markets witnessed a slight drop in silver prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X