వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

today gold price: బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం: ఎందుకంటే.?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గత కొద్ది కాలంగా తగ్గుతూనే ఉన్న బంగారం ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం గత మూడేళ్ల కాలంలో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దశాబ్దకాలంలో ఈ ఏడాది బంగారం ధరలకు మంచి సంవత్సరంగా పేర్కొనవచ్చు. డాలర్ బలహీనపడటం, ఏడాది ముగింపులో డిమాండ్ కొద్దిగా పెరగడంతో బంగారం ధరలపై ప్రభావం చూపాయి.

40వేల బెంచ్ మార్క్ దాటి..

40వేల బెంచ్ మార్క్ దాటి..

సెప్టెంబర్ 25 తర్వాత బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 10 గ్రాముల బంగారం ధర 2019 మొదటి నెల జనవరిలో రూ. 30వేలతో మొదలై.. ఇప్పుడు అంటే సంవత్సరాంతానికి రూ. 40వేలకు చేరింది. తాజాగా మంగళవారం 40వేల బెంచ్ మార్కును దాటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2010 తర్వాత ఇప్పుడే బంగారం ధరలు మంచి రేటును పలుకుతున్నాయి.

ఇక బంగారం పైపైకే..

ఇక బంగారం పైపైకే..

2020లో కూడా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని.. 2021కి బంగారం ధరలు అరలక్షకి చేరుకున్నా.. షాకవ్వాల్సిన అవసరం లేదని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 40,220గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 37,270గా ఉంది.

అంతర్జాతీయ పరిణామాలతో..

అంతర్జాతీయ పరిణామాలతో..

హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి రూ. 49,350గా ఉంది. మంగళవారం ఉదయం 7గంటల వరకు ఉన్న ధరలను ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయంగా జరిగే పరిణామాల ప్రభావానికి గురవుతుండటంతో బంగారం ధరలు స్వల్పంగా మారుతూ ఉంటాయి.

మరింత పెరిగే అవకాశం..

మరింత పెరిగే అవకాశం..

ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో 24కే 10 గ్రాముల బంగారం ధర రూ. 39,300లు ఉంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 36,500లుగా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 40,690 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 37,300గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 38,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 37,950గా ఉంది. గత కొద్ది నెలలుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు డిమాండ్ పెరుగుతుండటంతో ధరలు కూడా అదేబాటలో ఉన్నాయి. రానున్న కాలంలో మరింతగా ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Gold rose to its highest level in more than three months on Tuesday, capping its best year in nearly a decade, on weakening dollar and year-end buying in thin-volume trading.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X