వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Gold smuggling: ఐఏఎస్ అధికారి జ్యూస్ పిండుతున్న ఎన్ఐఏ, నాకేం తెలుసు ? బ్యూటీ ఆంటీ!

|
Google Oneindia TeluguNews

కొచ్చి/ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారంలో ఇప్పటికే సస్పెండ్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిని అధికారులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు. కేరళ సీఎంకే చెమటలు పట్టించిన బ్యూటీ ఆంటీ స్వప్న సురేష్ 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో కస్టమ్స్ అధికారుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిపై ఎన్ఐఏ అధికారులు రెండోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో స్వప్న సరేష్ కు ఉద్యోగం రావడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి సహకరించారని గోల్డ్ స్మగ్లింగ్ కేసు విచారణ చేస్తున్న అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

IAS Officer Submits Fake OBC Certificate | చిక్కుల్లో Kerala IAS || Oneindia Telugu

Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !

సీఎం ప్రధాన కార్యదర్శి

సీఎం ప్రధాన కార్యదర్శి

దేశవ్యాప్తంగా కలకలం రేపిన స్వప్న సురేష్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం కేరళ సీఎం పినరయి విజయన్ కు ముడిపెడుతూ ప్రతిపక్షాలు పెద్దఎత్తున రాద్దాంతం చేశాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ఆయన పదవికి రాజీనామా చెయ్యాలని దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. స్వప్న సురేష్ దెబ్బతో ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శిగా, సీఎం ప్రధాన కార్యదర్శి పదవుల్లో ఉంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ పై కేరళ సీఎం పినరయి విజయన్ వేలు వేసి ఆయన్ను ఆ పదవుల నుంచి తప్పించారు.

9 గంటలు కస్టమ్స్ అధికారులు

9 గంటలు కస్టమ్స్ అధికారులు

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెండ్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ ను ఇప్పటికే కస్టమ్స్ అధికారులు 9 గంటల పాటు విచారణ చేసి వివరాలు సేకరించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేష్ మీకు ఎంతకాలం నుంచి తెలుసు ? ఆమెతో మీకు ఉన్న లింక్ లు ఏమిటి ? ఆమెకు కేరళ ఐటీ శాఖలో ఉన్నత ఉద్యోగం ఎలా ఇచ్చారు ? స్మగ్లింగ్ వ్యవహారంలో మీ పాత్ర ఏమిటి ? అంటూ ఇలా రకరకాల ప్రశ్నలతో కస్టమ్స్ అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ ను ప్రశ్నించారని తెలిసింది.

ఎన్ఐఏ అధికారులు

ఎన్ఐఏ అధికారులు


స్వప్న సురేష్ గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారంలో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు జులై 23వ తేదీన కొచ్చి చేరుకున్నారు. తరువాత సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ ను సుమారు ఐదు గంటల పాటు ఎన్ఐఏ అధికారులు విచారణ చేసి విలువైన సమాచారం తెలుసుకున్నారని తెలిసింది. సస్పెండ్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ ను రెండోసారి ఎన్ఐఏ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు.

 బ్యూటీ స్వప్న సురేష్ వెనుక ఐఏఎస్ ?

బ్యూటీ స్వప్న సురేష్ వెనుక ఐఏఎస్ ?

కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో స్వప్న సురేష్ కు ఉన్నత ఉద్యోగం రావడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ సహాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ ఒత్తిడితోనే స్వప్న సురేష్ కు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో ఉద్యోగం వచ్చిందని, అక్కడి నుంచి ఆమె స్మగ్లింగ్ వ్యహారం నడిపారని ఈ కేసు విచారణ చేస్తున్న అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో స్వప్నకు తెలుసు

ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో స్వప్నకు తెలుసు

గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం స్వప్న సురేష్ తో ఉద్యోగ పరంగానే తనకు పరిచయం ఉందని, అంతకు మించి ఆమెతో ఎలాంటి సంబంధాలు లేవని సస్పెండ్ కు గురైన సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ విచారణ చేస్తున్న అధికారులకు చెబుతున్నారు. అయితే కేరళ ఐటీ శాఖలో స్వప్న సురేష్ నకిలీ పత్రాలు సమర్పించి తాత్కాలిక ఉద్యోగంలో చేరారని, ఆమె ప్రభుత్వాన్ని మోసం చేసిందని మరో కేసు నమోదైయ్యింది.

బ్యూటీ ఆంటీ దెబ్బతో కూసాలు !

బ్యూటీ ఆంటీ దెబ్బతో కూసాలు !

గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో పాటు అక్రమంగా విదేశాల నుంచి నగదు తరలించారని, నకిలీ పత్రాలు సమర్పించి ప్రభుత్వ శాఖలో ఉద్యోగంలో చేరారని మరో రెండు కేసులు నమోదైనాయి. మొత్తం మీద బ్యూటీ ఆంటీ స్వప్న సురేష్ దెబ్బకు సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు అనేక మంది రాజకీయ నాయకులు, అధికారుల కూసాలు కదలిపోతున్నాయి.

English summary
Gold smuggling case: Kerala Suspended senior IAS officer M. Sivasankar is being questioned by the National Investigation Agency officials here for the second time in connection with the ongoing probe into the gold smuggling case, sources said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X