వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Gold smuggling: సీక్రెట్ లు చెప్పాలంటున్న స్వప్న మేడమ్, సరిత్: ఏం చెబుతుందో అంటూ కొందరికి టెన్షన్ !

|
Google Oneindia TeluguNews

కొచ్చి/ తిరువనంతపురం/ న్యూఢిల్లీ: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన స్వప్న అలియాస్ స్వప్న సురేష్, అమెకు అత్యంత సన్నిహితుడు సరిత్ బాంబే పేల్చారని తెలిసింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి మేము కొన్ని రహస్యాలు కోర్టులో చెప్పాలనుకుంటున్నామని దర్యాప్తు సంస్థల అధికారులకు స్వప్న సురేష్, సరిత్ లు చెప్పారని తెలిసింది. స్వప్న సురేష్, సరిత్ లో కోర్టుకు ఏం చెప్పాలనుకుంటున్నారు ? అనే విషయంపై ఇప్పుడు కేరళలో తీవ్ర చర్చకు దారితింది. స్వప్న సురేష్, సరిత్ లు ఏం బాంబు పేల్చుతారో ? అంటూ కొందరికి టెన్షన్ మొదలైయ్యిందని తెలిసింది.

Shock: 15 ఏళ్ల అమ్మాయిపై 400 మంది రేప్, లైంగిక దాడి, లిస్టులో డాక్టర్లు, ఇన్స్ పెక్టర్లు, బీజేపీ లీడర్, వీఐపీలు, ఆంటీ !Shock: 15 ఏళ్ల అమ్మాయిపై 400 మంది రేప్, లైంగిక దాడి, లిస్టులో డాక్టర్లు, ఇన్స్ పెక్టర్లు, బీజేపీ లీడర్, వీఐపీలు, ఆంటీ !

సెంట్రల్ జైల్లో స్వప్న ఆంటీ అండ్ కో

సెంట్రల్ జైల్లో స్వప్న ఆంటీ అండ్ కో

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన స్వప్న సురేష్, ఆమె అనుచరుడు సరిత్ తో పాటు మిగిలిన నిందితులు ప్రస్తుతం కొచ్చిలోని సెంట్రల్ జైలులో ఉంటున్నారు. ఇదే గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేరళ ముఖ్యమంత్రి పనిరయి విజయన్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ సైతం కొచ్చి జైల్లోనే ఉంటున్నారు.

రహస్యంగా చెప్పాలని మనవి

రహస్యంగా చెప్పాలని మనవి

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన స్వప్న అలియాస్ స్వప్న సురేష్, అమెకు అత్యంత సన్నిహితుడు సరిత్ బాంబే పేల్చారని తెలిసింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి మేము కొన్ని రహస్యాలు కోర్టులో చెప్పాలనుకుంటున్నామని దర్యాప్తు సంస్థల అధికారులకు స్వప్న సురేష్, సరిత్ లు చెప్పారని తెలిసింది. కోర్టులో స్వప్న సురేష్ ఏమి చెప్పిందో ? అనే విషయం ఈడీ, కస్టమ్స్ అధికారులకు సైతం అంతు చిక్కడం లేదని సమాచారం.

లాయర్ తో సమాచారం ఇవ్వండి

లాయర్ తో సమాచారం ఇవ్వండి

స్వప్న సురేష్, సరిత్ వారు చెప్పాలనుకున్న రహస్యాలను వారి న్యాయవాదుల సహకారంతో తెలియజేయాలని ప్రత్యేక కోర్టు సూచించింది. ఇదే సమయంలో రెండు రోజుల పాటు స్వప్న సురేష్ రిమాండ్ గడువును కోర్టు పొడగించింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ తో పాటు ఈ కేసులో అరెస్టు అయిన వారికి సంబంధాలు ఉన్నాయని అధికారులు గట్టిగా చెబుతున్నారు.

ఐఏఎస్ కు మూడు ఫోన్లు

ఐఏఎస్ కు మూడు ఫోన్లు

గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు ఐఏఎస్ అధికారి శివశంకర్ కు ఎలాంటి సంబంధాలు లేవని స్వప్న సురేష్ చెప్పిందని వెలుగు చూసింది. అయితే ఐఏఎస్ అధికారి శివశంకర్ మూడు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారని కస్టమ్స్ అధికారులు అంటున్నారు. తాను ఒక్క మొబైల్ ఫోన్ మాత్రమే ఉపయోగిస్తున్నానని ఇప్పటికే ఐఏఎస్ అధికారి శివశంకర్ అధికారులకు చెప్పాడు.

Recommended Video

#Bangalore : బెంగుళూరు లో కురిసిన Gold Coins.. మళ్లీ వాన కోసం చూస్తున్న జనం! || Oneindia Telugu
 అన్నీ అపద్దాలు చెబుతున్నారు

అన్నీ అపద్దాలు చెబుతున్నారు

ఐఏఎస్ అధికారి శివశంకర్ అపద్దాలు చెబుతున్నారని, ఆయన ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లు మాకు చిక్కాయని, మరో ఫోన్ కోసం ఆరా తీస్తున్నామని కస్టమ్స్ అధికారులు అంటున్నారు. మొత్తం మీద మరోసారి స్వప్న సురేష్ ఏం బాంబు పేల్చుతుందో అంటూ చాలా మంది ప్రముఖులు, కేరళలోని పలు రాజకీయ పార్టీల నేతలు చాలా ఆసక్తిగా, టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.

English summary
Gold smuggling case: Swapna Suresh and Sarith will gave secret statement in Kerala cotur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X