చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాదేదీ బంగారం స్మగ్లింగ్‌కు అనర్హం.. మొన్న ఇస్త్రీ పెట్టెలు.. నేడు మురుకుల మిషన్

|
Google Oneindia TeluguNews

చెన్నై: బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. గోల్డ్ స్మగ్లింగ్‌కు కాదేదీ అనర్హమని భావిస్తున్నారు. ఆ క్రమంలో విదేశాల నుంచి కిలోలకొద్దీ బంగారం తీసుకొస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఎయిర్ పోర్టు అధికారుల కళ్లు గప్పి బయట పడదామని అనుకుంటున్నప్పటికీ.. అది సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల విమానాశ్రయాల్లో వెలుగుచూస్తున్న ఘటనలే నిదర్శనం.

విదేశాల్లో తక్కువ ధరకు దొరికే బంగారం కిలోలకొద్దీ ఇండియాకు తీసుకొస్తున్న స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు ఎయిర్ పోర్టు అధికారులు. ఆ క్రమంలో చెన్నై విమానాశ్రయంలో వెలుగు చూసిన ఘటన చర్చానీయాంశంగా మారింది. విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి నుంచి దాదాపు 21 లక్షల రూపాయల విలువ చేసే 555 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మురుకులు చేసే మిషన్‌లో 555 గ్రాముల బంగారాన్ని ఆరు కడ్డీలుగా చేసి తన వెంట తీసుకొచ్చాడు సదరు ప్రయాణీకుడు. అయితే అధికారు తనిఖీల్లో బయటపడటంతో కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు.

gold smuggling in different way caught one person in chennai airport

వామ్మో ఇదేమి ఫీటు.. కొండచిలువతో పోటీ పడితే కండ పీకిందిగా (వీడియో)వామ్మో ఇదేమి ఫీటు.. కొండచిలువతో పోటీ పడితే కండ పీకిందిగా (వీడియో)

ఇటీవల హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కూడా ఇలాంటి ఘటన వెలుగు చూసింది. దాదాపు 3 కోట్ల రూపాయల విలువ చేసే 9 కిలోల 200 గ్రాముల గోల్డ్‌ను ఓ ప్రయాణీకుడు నాలుగు ఇస్త్రీపెట్టెల్లో తీసుకు రావడం గమనార్హం. ఇస్త్రీ పెట్టెల్లోని వేడెక్కే లోహం తొలగించి సేమ్ అదే షేపులో (V shape) బంగారు కడ్డీలను అమర్చాడు. ఒక్కో కడ్డీని 2 కిలోల 300 గ్రాముల వెయిట్‌తో తయారు చేయించాడు. అంతేకాదు వాటికి సిల్వర్ కోట్ వేయించాడు. ఒకవేళ కస్టమ్స్ అధికారులకు దొరికి ఆ ఇస్త్రీ పెట్టెలను విప్పినా.. సిల్వర్ కలర్ ఉండటంతో గుర్తుపట్టబోరని భావించాడు. కానీ ఆ ఎత్తుగడ చిత్తయింది.

English summary
One Traveller Caught with gold in Chennai Air Port while he kept in one kitchen utensil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X