• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Gold Smuggling: స్వర్గం చూపించిన స్వప్నతో వీఐపీకి లింక్ ? దెబ్బకు ఏడు మంది ఏజెంట్లు ఔట్ !

|

కొచ్చి/తిరుచ్చి/చెన్నై: దేశవ్యాప్తంగా కలకలం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు కథ తమిళనాడులోని తిరుచ్చికి చేరింది. స్వర్గం చూపిస్తున్న కిలాడిలేడీ స్వప్న సురేష్ తో తిరుచ్చికి చెందిన ప్రముఖ జ్యువెలర్స్ వ్యాపారి, ఓ వీఐపీతో లింక్ ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారుల విచారణలో వెలుగు చూసింది. కొచ్చి నుంచి తిరుచ్చి చేరుకున్న ఎన్ఐఏ అధికారులు వారి దగ్గర ఉన్న సమాచారంతో పలు ప్రాంతాల్లోని వారిని విచారణ చేసి ఏడు మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని ఎంతవేగంగా వచ్చారో అంతే వేగంతో కేరళ పిలుచుకుని వెళ్లిపోయారు. కిలాడి స్వప్న సురేష్ స్మగ్లింగ్ కేసు ఏజెంట్లు అందూ తిరుచ్చికి చెందినవారే అని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

చరిత్ర: పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలు..నేలమాళిగల్లో ఉన్న నిధులేంటి..?

I'M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!

 యూఏఈ పార్శిల్

యూఏఈ పార్శిల్

కేరళలోని తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్ కు వచ్చిన పార్శిల్ లో 30 కేజీల బంగారం ఉందని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసును కేరళ ప్రభుత్వాన్ని కుదిపేసింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు చెమటలు పట్టినంత పని అయ్యింది. కేరళ సీఎం పినరయి విజయన్ ఆయన పదవికి రాజీనామా చెయ్యాలి అంటూ ఆందోళనకు చేసేవరకు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం వెళ్లింది.

 స్వప్నపై ఎన్ఐఏ పంజా

స్వప్నపై ఎన్ఐఏ పంజా

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లేడీ కిలాడి స్వప్న సురేష్ పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పంజా విసిరి బెంగళూరులో ఆమెను అరెస్టు చేసింది. అప్పటి నుంచి స్వప్న సురేష్ ను అధికారులు విచారణ చేసి పలుకీలక సమాచారాన్ని సేకరించారు. కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాన కార్యదర్శిగా, కేరళ ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తే స్మగ్లింగ్ కేసు దెబ్బకు సస్పెండ్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ ను సైతం ఇప్పటికే రెండుసార్లు ఎన్ఐఏ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు.

 సీన్ కట్ చేస్తే తిరుచ్చి

సీన్ కట్ చేస్తే తిరుచ్చి

స్వప్న సురేష్ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించిన ఏజెంట్లు అందరూ తమిళనాడులోని తిరుచ్చికి చెందిన వారే అని ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది. అంతే గోల్డ్ స్మగ్లింగ్ ఏజెంట్ల వివరాలు బయటకు తెలిసినా, స్థానిక పోలీసులతో వాళ్లకు లింక్ లు ఉన్నా సీన్ రివర్స్ అవుతోందని భావించిన ఎన్ఐఏ అధికారులు తిరుచ్చి పోలీసులకు కనీసం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా అక్కడికి వెళ్లిపోయారు.

 జాఫర్ ఖాన్, అండగుండం

జాఫర్ ఖాన్, అండగుండం

తిరుచ్చిలోని జాఫర్ ఖాన్ వీధి, అండగుండం వీధుల్లో సోదాలు చేసి విచారణ చేసిన ఎన్ఐఏ అధికారులు ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆరు మందిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు తిరుచ్చిలోని ప్రముఖ బంగారు నగల వ్యాపారి (జ్యువెలర్స్ యజమాని)ని విచారణ చేసి ఆయన్ను అదులోకి తీసుకున్నారు.

 కోల్ కత్తా, ముంబాయితో లింక్ ?

కోల్ కత్తా, ముంబాయితో లింక్ ?

తిరుచ్చిలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న 7 మంది కోల్ కతా, ముంబాయి, తిరుచ్చి. కేరళ స్మగ్లింగ్ ఏజెంట్లుగా పని చేస్తున్నారని సమాచారం. తిరుచ్చిలో అదుపులోకి తీసుకున్న 7 మందిని ఆ ప్రాంతంలో వారు ఎక్కువ సేపు ఉండకుండా వెంటనే ఎన్ఐఏ అధికారులు కేరళలోని తిరువనంతపురంలోని ఎన్ఐఏ కార్యాలాయానికి తీసుకుని వెళ్లిపోయారు.

 స్వప్న స్వర్గం చూపించిన వీఐపీ ఎవరు ?

స్వప్న స్వర్గం చూపించిన వీఐపీ ఎవరు ?

గోల్డ్ స్మగ్లింగ్ కింగ్ పిన్ స్వప్న సురేష్ కు తిరుచ్చిలోని ప్రముఖ వీఐపికి లింక్ ఉందని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసిందని తమిళ మీడియా అంటోంది. ఎన్ఐఏ అధికారులు అదే సమయంలో తిరుచ్చి వచ్చి 7 మందిని అదుపులోకి తీసుకుని వెంటనే కేరళ వెళ్లిపోవడంతో ఆ అనుమానం నిజమైయ్యిందని తెలుస్తోంది. కిలాడీ లేడీ స్వప్న సురేష్ తో లింక్ ఉన్న తిరుచ్చిలోని ఆ వీఐపి ఎవరు ? అంటూ కేరళ, తమిళనాడులో జోరుగా చర్చ జరుగుతోంది. మొత్తం మీద గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం తిరుచ్చితో ముడిపడి ఉందని వెలుగు చూసింది. ఇటీవల కాలంలో తిరుచ్చి ఎయిర్ పోర్టులో భారీ మొత్తంలో బంగారం స్మగ్లింగ్ చూస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.

English summary
Gold Smuggling: Kerala Swapna are Trichy VIP connected with Kerala Gold Smuggling Gang?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X