Gold smuggling: ఐఏఎస్ అధికారితో సంబంధాలపై క్లారిటీ ఇచ్చిన స్వప్న సురేష్ ? మేడమ్ స్టేట్ మెంట్ లో!
తిరువనంతపురం/ కొచ్చి/ కేరళ: స్వప్న సురేష్ పేరు ఇటీవల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. దేశవ్యాప్తంగా కుదిపేసిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ చీఫ్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేసి చివరికి అరెస్టు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసు కింగ్ పిన్, కిలాడీ ఆంటీ స్వప్న సురేష్ దెబ్బకు సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ కటకటాలపాలైనారు. అయితే కస్టమ్స్ అధికారులకు స్టేట్ మెంట్ ఇచ్చిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు కింగ్ పిన్ స్వప్న సురేష్ ఐఏఎస్ అధికారి శివశంకర్ కు, గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు ఉన్న సంబంధాల గురించి క్షుణ్ణంగా క్లారిటీ ఇచ్చిందని వెలుగు చూసింది.
Beautiful wife: ఎవరు వాళ్లు ? ఎందుకొస్తున్నారు ?, భార్య గొంతు ఉల్లిపాయ కోసినట్లు కోసేసిన భర్త !

ఐఏఎస్ ఏం చెప్పారంటే ?
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు కింగ్ పిన్ స్వప్న సురేష్ కు ఆ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు సహకరించారని ఆరోపణలు రావడంతో ఈడీ, సీబీఐ, కస్టమ్స్ అధికారులు అనేక కోణాల్లో విచారణ చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు జులై నెలలో మూడు సార్లు కొచ్చిలోని వారి కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. అధికారుల విచారణలో జులై 27వ తేదీ, జులై 31వ తేదీన తనకు గోల్డ్ స్మగ్లింగ్ కు ఎలాంటి సంబంధం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ అధికారులకు స్టేట్ మెంట్ ఇచ్చారు.

సరిత్, ఐఏఎస్ ఫోటోల కలకలం
గోల్డ్ స్మగ్లింగ్ కేసు కింగ్ పిన్ స్వప్న సురేష్ కు అత్యంత సన్నిహితంగా మెలిగారని ఆరోపణలు రావడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి శివశంకర్ ను ఆ పదవి నుంచి తొలగించారు. తరువాత ఐఏఎస్ అధికారి శివశంకర్ ను విచారణ చేసిన అధికారులు అరెస్టు చేశారు. ఇదే సమయంలో స్వప్న సురేష్ కు అత్యంత సన్నిహితుడు ఇప్పటికే అరెస్టు అయిన సరిత్ తో కలిసి ఐఏఎస్ అధికారి శివశంకర్ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఫోటోలు బయటకు రావడం కలకలం రేపింది.

మేడమ్ స్టేట్ మెంట్
కస్టమ్స్ అధికారుల విచారణలో స్వప్న సురేష్ అనేక విషయాలు వెళ్లడించిందని తెలిసింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో ఐఏఎస్ అధికారి శివశంకర్ కు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో అరెస్టు అయిన వారికి ఆయనకు సంబంధాలు లేవని స్వప్న సురేష్ స్టేట్ మెంట్ ఇచ్చిందని ప్రముఖ మీడియా సంస్థ ట్వంటీ ఫోర్ వార్తలు ప్రచురించింది, మేడమ్ స్వప్న సురేష్ స్టేట్ మెంట్ ను సీల్డ్ కవర్ లో అధికారులు ఇప్పటికే కోర్టుకు సమర్పించారు.

ఐఏఎస్ కు సంబంధం లేదు
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన స్వప్న సురేష్ కు, ఐఏఎస్ అధికారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని వెలుగు చూసింది. ఒక జాతీయ బ్యాంకులో స్వప్న సురేష్ సీక్రెట్ లాకర్లు తెరవడానికి ఐఏఎస్ అధికారి శివశంకర్ సహాయం చేశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. అయితే బ్యాంకు లాకర్లు తియ్యడానికి మాత్రమే ఐఏఎస్ అధికారి శివశంకర్ సహాయం చేశారని, అందులో తాను డబ్బు, బంగారం దాచి పెడుతున్నానని ఆయనకు ఏమాత్రం తెలీదని స్వప్న సురేష్ కస్టమ్స్ అధికారులకు స్టేట్ మెంట్ ఇచ్చిందని వెలుగు చూసింది.

కేసులు నిలబడుతాయా ?
ఐఏఎస్ అధికారి శివశంకర్ మీద ఇప్పటికే ఈడీ, కస్టమ్స్ అధికారులు కేసులు నమోదు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో ఐఏఎస్ అధికారి శివశంకర్ తో సంబంధాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. అయితే గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో ఐఏఎస్ అధికారి శివశంకర్ కు సంబంధాలు లేవని స్వప్న సురేష్ స్టేట్ మెంట్ ఇచ్చిందని వెలుగు చూసింది. ఇలాంటి సమయంలో ఈడీ, కస్టమ్స్ అధికారులు ఐఏఎస్ అధికారి శివశంకర్ మీద నమోదు చేసిన కేసులు కోర్టులో నిలబడుతాయా ?, అధికారుల దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయా ? అనే విషయం వేచి చూడాల్సిందే.