వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రాలో బంగారం.. అమ్మాయి కాదు సుమా... ఎంతో తెలుసా..? చూసి ఖంగుతిన్న...

|
Google Oneindia TeluguNews

బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. అక్రమంగా తీసుకొచ్చిన బంగారం కస్టమ్స్ కంట్లో పడకుండా ఉండేందుకు రకరకాల ఫీట్లు చేస్తుంటారు. ఇటీవల ఓ ప్రయాణికుడు కూడా అలాంటి ప్రయోగం చేసి కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం స్కానర్లకు పట్టుబడ్డాడు.

ఈ నెల 22న మాస్కో నుంచి ఎస్‌యూ 232 అనే విమానంలో ఓ ప్రయాణికుడు వచ్చాడు. అతడు భారీగా బంగారం తీసుకొస్తాడని కస్టమ్ అధికారులకు సమాచారం ఉంది. అతడిని నిశీతంగా పరిశీలించిన వారికి బంగారం లభించలేదు. కానీ బ్యాగ్‌కు బంగారు కడ్డీలు అమర్చాడు. అలా ఆరు దొరికాయి. అయినా ఇంకా ఏదో ఉందని వెతికితే.. షర్ట్ లోపల బ్రా ఉంది. బ్రా ఏంటి అని అనుమానించి చూస్తూ అందులో బంగారు తీగలు ఉన్నాయి. ఆరు బంగారు తీగలు కనిపించాయి. ఈ రెండు కలిపి 794 గ్రాముల బరువు ఉంది. వీటి విలువ మార్కెట్లో రూ.30 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు.

gold wire in bra.. gold bars in luggage...

అతనిపై కస్టమ్స్ సెక్షన్ 110 చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసు తదుపరి విచారణ జరుగుతుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు గత నెలలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులోనే 9 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. బంగారం విలువ రూ.3 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అప్పడు కూడా బంగారాన్ని 12 ముక్కలు చేసి తప్పించుకునేందుకు స్మగ్లర్ ప్రయత్నించాడని అధికారులు చెప్తున్నారు.

English summary
passenger arriving Moscow to Delhi by flight. the man arrived at the IGI Airport, his luggage was thoroughly checked. During the search, gold wire and gold bars were recovered this worth 30 lakhs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X