వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దసరా ఉత్సవాలకు బంగారు దుర్గమ్మ ... 50 కేజీల బంగారంతో కలకత్తాలో తయారీ

|
Google Oneindia TeluguNews

దసరా ఉత్సవాలకు దేశమంతా సిద్ధమవుతోంది. దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మను ఆరాధించేందుకు సిద్ధమవుతున్నారు అమ్మవారి భక్తులు. అసలు దసరా అనగానే గుర్తొచ్చేది ముందుగా కలకత్తా కాళీమాత . దసరా అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో అంగరంగ వైభవంగా చేస్తారు.

చాకలి ఐలమ్మ స్పూర్తితోనే.. బంగారు తెలంగాణ: హరీష్ రావుచాకలి ఐలమ్మ స్పూర్తితోనే.. బంగారు తెలంగాణ: హరీష్ రావు

దసరా ఉత్సవాలను ,దుర్గాపూజను మన ఇండియాలోని పశ్చిమ బెంగాల్ లో ఎక్కువగా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకొంటారు. ఈ దసరాను వారు సహజంగా దుర్గోత్సవం లేదా దుర్గా పూజ అని పిలుచుకొంటారు. పశ్చిమబెంగాల్‌లో 9 రోజులపాటు, దుర్గాంబని ఆరాధించి, 10వ రోజున, సముద్రంలోనో, నదిలోనో, చెరువులోనో నిమజ్జనం చేస్తారు. బెంగాల్‌, అస్సామ్‌, ఒరిస్సాలలో, దుర్గామాతాని శక్తికి సంకేతంగా, కాళికగా కూడా కొలుస్తారు. ఈసారి అత్యంత ప్రత్యేకంగా శరన్నవరాత్రి వేడుకలను పశ్చిమ బెంగాల్ లో నిర్వహించనున్నారు. ఈ సారి వేడుకలకు బంగారు దుర్గమ్మను ప్రధాన ఆకర్షణగా తీర్చిదిద్దుతున్నారు.

golden durga for Dussehra ... Made in kolkata with 50 kg of gold

శరన్నవ‌రాత్రి వేడుకలకు పశ్చిమ బెంగాల్ ముస్తాబవుతోంది. ఈ సంవత్సరం కలకత్తాలో దసరా వేడుకలు చాలా ప్రత్యేకంగా జరగనున్నాయి . 13 అడుగుల ఎత్తుతో దుర్గాదేవి భారీ విగ్రహాన్ని బంగారంతో త‌యారు చేస్తున్నారు. దీంతో అమ్మవారి వేడుకల్లో ఈ భారీ బంగారు విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలవబోతుంది .బంగారంతో తయారు చేసిన ఈ అమ్మవారి విగ్రహాన్ని సెంట్ర‌ల్ కోల్‌క‌తాలోని సంతోష్ మిత్ర స్క్వేర్ వ‌ద్ద ఉన్న మండ‌పంలో ప్ర‌తిష్టించ‌నున్నారు.

అత్యంత ఖర్చుతో చాలా వ్యయ ప్రయాసలకోర్చి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. 13 అడుగుల ఎత్తుతో 50 కేజీల బంగారంతో బంగారు దుర్గమ్మ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. దీని విలువ 20 కోట్లకు పైనే ఉంటుందని అంచనా . మేలిమి బంగారంతో విగ్ర‌హాన్ని తయారు చేస్తున్నామ‌ని, 50 కిలోల బంగారాన్ని విగ్రహం తయారీలో వినియోగిస్తారని, మేలిమి బంగారంతో బంగారు తల్లి విగ్రహం తయారు చేయడం చాలా సంతోషంగా ఉందని విగ్రహం తయారీదారులు పేర్కొన్నారు.

English summary
The Dussehra celebrations will be held in Calcutta, West Bengal.The statue is made of gold Durgamma with a height of 13 feet and 50 kgs of gold . It is estimated to be worth over 20 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X