వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘గోలీమారో’ నినాదంపై దద్దరిల్లిన లోక్‌సభ.. మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ ఎంపీలు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వివాదాస్పద నినాదం 'దేశ్ కే గద్దారోంకో.. గోలీమారో సాలోంకో(దేశద్రోహుల్ని కాల్చిపారేయండి)'పై సోమవారం లోక్ సభ దద్దరిల్లింది. మంత్రిగా ఉండి ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన అనురాగ్ పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుపట్టడంతో సభాకార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది.

సోమవారం పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష పార్టీలు.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు, ఆందోళనలు చేశారు. లోక్ సభలో ముందుగా ప్రశ్నోత్తరాలు పూర్తిచేద్దామని స్పీకర్ ఓం బిర్లా సూచించినా కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోలేదు. గందరగోళం మధ్యనే క్వశ్చ అవర్ చేపట్టారు. ఓ సభ్యుడి ప్రశ్నకు మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సమాధానమిస్తుండగా కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకున్నారు.

Goli maarna band karo, Cong MPs protest against minister Anurag Thakur in Lok Sabha

మంత్రి అనురాగ్ పై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. 'ఎక్కడున్నాయి మీ బుల్లెట్లు?' 'ఇకనైనా బుల్లెట్లు పేల్చడం ఆపండి(గోలీ మార్నా బంద్ కరో)' అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. ఇవేవీ పట్టనట్లు చకచకా సమాధానం చదవేసి మంత్రి తన సీట్లో కూర్చుండిపోయారు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 'గోలీమారో' నినాదం తర్వాత.. ఢిల్లీలోని జామియా వర్సిటీ దగ్గర సీఏఏ వ్యతిరేక ప్రదర్శన చేస్తోన్న విద్యార్థులపై యూపీకి చెందిన రాంభక్త్ గోపాల్ శర్మ అనే టీనేజ్ బాలుడు కాల్పులు జరపడం తెలిసిందే. మంత్రులు, బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నందుకే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోలీమారో కామెంట్లను తప్పుపట్టిన ఎన్నికల సంఘం.. ఢిల్లీలో ప్రచారం చేయరాదంటూ మంత్రిపై నిషేధం విధించింది.

English summary
The Congress on Monday raised slogans against Union minister Anurag Thakur in Lok Sabha over his controversial remarks during a recent election rally in the national capital. Some members also shouted 'Goli maarna band karo (Stop shooting)'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X