• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కూర్చున్న చోటకే చుక్క..ఆ కిక్కే వేరబ్బా అంటున్న మద్యం ప్రియులు..స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ డెలివరీ..

|

జార్ఖండ్/హైదరాబాద్ : మద్యం ప్రియులకు శుభవార్త. మీరు గంటలు గంటలు ముఖానికి మాస్క్ పెట్టుకుని వైన్ షాపుల ముందు క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరూ ఎప్పుడూ మీకిష్టమైన ఆహార పదార్థాలను, బిర్యాని, చికెన్ గట్రా ఐటమ్ లు ఆర్డర్ ఇచ్చి వేడివేడివి ఇంటికి తెప్పించుకుంటున్నట్టే ఇక మీదట మీకు ఇష్టమైన, మీకు నచ్చే కిక్కిచ్చే మద్యాన్ని కూడా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఎంతో సుపరిచితమైన స్విగ్గీ, జొమోటో వంటి హోమ్ డెలివరీ సంస్థలు ద్వారానే బుక్ చేసుకునే వెసుబాటు అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సౌకర్యం ఏ రాష్ట్రంలో..? ఎప్పటి నుండి..? తెలుసుకుందాం..!

 తెలంగాణలో కరోనా విజృంభణకు మద్యం షాపులు, ఇతర మినహాయింపులే కారణమా..?ఇప్పుడేంచేయాలి..? తెలంగాణలో కరోనా విజృంభణకు మద్యం షాపులు, ఇతర మినహాయింపులే కారణమా..?ఇప్పుడేంచేయాలి..?

ఆన్ లైన్ లో మద్యం పొందొచ్చు.. ముందుకొచ్చిన స్విగ్గీ, జొమోటో సంస్థలు..

ఆన్ లైన్ లో మద్యం పొందొచ్చు.. ముందుకొచ్చిన స్విగ్గీ, జొమోటో సంస్థలు..

కొన్ని కొన్ని సందర్బాల్లో బయటకు వెళ్లి మనకు కావాల్సినవి తెచ్చుకోవడానికి చాలా బద్దకంగా, ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఉదయాన్నే ఆఫీస్ కు వెళ్లి సాయంత్రానికి అలసి పోయి ఇంటికి చేరుకున్న ఉద్యోగులకు మళ్లీ బయటకు వెళ్లలంటే పరమ చిరాగ్గా ఉంటుంది. ట్రాఫిక్ లో అలసి సొలసి ఇంటికి వస్తే మళ్లీ ఈ షాపుల గోలేంటిరా బాబూ అనే అసహనం కలుగుతుంది. అందుకే వేడి వేడి బిర్యాని దగ్గర నుండా స్నాక్స్ వరకూ ఆన్ లైన్ సేవలను ఆశ్రయిస్తున్నారు నగర యువత. అంతే కాకుండా రెండు పెగ్గులేసి భోజనం చేసే అలవాటు ఉన్న వాళ్లు కూడా ఈ మద్యాన్ని కూడా ఆన్ లైన్ లో విక్రయిస్తే బాగుండేదనే అభిప్రాయలను వ్యక్తం చేసారు.

వినూత్న తరహాలో ఆలోచించిన జార్ఖండ్ రాష్ట్రం... ఇక చుక్క, ముక్క పొందడం చాలా తేలిక..

వినూత్న తరహాలో ఆలోచించిన జార్ఖండ్ రాష్ట్రం... ఇక చుక్క, ముక్క పొందడం చాలా తేలిక..

అలాంటి మద్యం ప్రియుల కోసం ప్రభుత్వాలు వినూత్న సదుపాయం కలిగిస్తున్నాయి. జార్ఖండ్ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి మద్యం ప్రియుల కోసం కొన్ని వెసులుబాటులు తీసుకొచ్చింది. ఇంట్లోనే ఉండి మద్యం ఆర్డర్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది జార్ఖండ్ ప్రభుత్వం. అందుకోసం ఫుడ్ డెలివరీ సంస్ధల్లో అగ్రగామి పాత్ర పోషిస్తున్న స్విగ్గీ, జొమోటో వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుని మద్యాన్ని ఆన్ లైన్ లో విక్రయించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో జార్ఖండ్ యువత ఇంటి ముందుకు వచ్చిన మద్యం బాటిళ్లను ఎగిరి గంతేసి అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తోంది.

మద్యం ప్రియురాళ్ల క్యూలైన్ బాధలు తప్పినట్టే.. ఆర్డర్ ఇస్తే ఇంటికే మద్యం..

మద్యం ప్రియురాళ్ల క్యూలైన్ బాధలు తప్పినట్టే.. ఆర్డర్ ఇస్తే ఇంటికే మద్యం..

మందు ప్రియులకు, మందు ప్రియురాళ్లకు జార్ఖండ్ ప్రభుత్వం సంతోషకర వార్తలను అందించింది. ఇక మీదట ఆన్‌లైన్‌ ద్వారా ఇంటికే మద్యం హోం డెలివరీ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని రాంచీ, జంషెడ్‌పూర్‌, బొకారో లాంటి 9 పట్టణాల్లో మద్యాన్ని ఇంటికే డెలివరీ చేసేందుకు స్విగ్గీ, జోమాటలతో ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు 15 జిల్లా కేంద్రాల్లో ఆన్ లైన్ టోకెన్ విధానం ద్వారా షాపుల్లోనూ లిక్కర్‌ను కొనుగోలు చేసే సౌకర్యం ఉందన్న జార్ఖండ్ ప్రభుత్వం, మద్యం దుకాణాల వద్ద క్యూలైన్లను తగ్గించేందుకు ఆన్‌లైన్‌ డెలివరీకి అనుమతి ఇచ్చినట్లు వివరణ ఇచ్చింది.

ఎగిరి గంతేస్తున్న జార్ఖండ్ యువత.. ఆన్ లైన్ బుకింగ్ ల కోసం ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల యువకులు..

ఎగిరి గంతేస్తున్న జార్ఖండ్ యువత.. ఆన్ లైన్ బుకింగ్ ల కోసం ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల యువకులు..

కరోనా వైరస్ నేపథ్యలో మద్యం షాపుల వద్ద సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరి అని, అలాగే డెలివరీ బాయ్స్ కూడా తమ వెంట ఎల్లప్పుడూ హ్యాండ్ శానిటైజర్ ఉంచుకోవడమే కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇలా ఉండగా లాక్‌డౌన్ 4.0లో భాగంగా ఆ రాష్ట్రంలో ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఇందులో భాగంగానే అన్ని మద్యం షాపులు ఓపెన్ చేసుకునేందుకు జార్ఖండ్ సర్కార్ అనుమతులు మంజూరు చేసింది. వైన్ షాపుల ముందు క్యూలైన్లలో నిలబడడానికి ఇబ్బందులు పడే అమ్మాయిలు కూడా ఇప్పుడు ఎంచక్కా తమకు ఇష్టమైన మద్యాన్ని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి ఆస్వాదించడచ్చన్న మాట. మరి ఇదే సౌకర్యం మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు అమలు చేస్తారబ్బా అని మద్యం ప్రియులు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.

English summary
You can also book your favorite, liquor of your choice online. It also offers you the option to book through home delivery companies such as Swiggy and Zomoto.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X