వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ .. నవంబర్ 16 నుండి భక్తులకు స్వామిదర్శనం

|
Google Oneindia TeluguNews

కేరళలోని శబరిమల ఆలయం నవంబర్ 16 న మండల, మకర జ్యోతి దీక్ష చేసే యాత్రికుల కోసం తెరవబడుతుంది .ప్రతి శీతాకాలంలో రెండు నెలల మండలం- మకర జ్యోతి దర్శనాల సీజన్ లో లక్షలాదిగా అయ్యప్ప భక్తులు స్వామిని దర్శించుకోవటానికి వస్తారు . శబరిమల ఆలయాన్ని ప్రతి ఏటా 30 లక్షల మంది యాత్రికులు సందర్శిస్తారు. అయితే ఈ ఏడాది కోవిడ్ కారణంగా శబరిమల ఆలయం మూత పడింది . దేవస్వం మంత్రి కడకంపల్లి సురేంద్రన్ నవంబర్ 16 న ఆలయ తలుపులు తెరుచుకుంటాయని , భక్తుల దర్శనాలను అప్పటి నుండి అనుమతిస్తామని చెప్పారు .

అన్ని కోవిడ్ -19 ప్రోటోకాల్‌లు పాటించబడతాయని, భక్తుల సంఖ్య కూడా ఉంటుంది పరిమితం చేయబడిందని ఆయన తెలిపారు . భక్తులందరూ తీర్థయాత్ర చేపట్టే ముందు కోవిడ్-నెగటివ్ సర్టిఫికెట్లు సమర్పించడం తప్పనిసరిగా కూడా ఆయన పేర్కొన్నారు .ఐసిఎంఆర్ గుర్తింపు ఉన్న ల్యాబ్ లలో పరీక్షలు చేయించుకుని కరోనా నెగిటివ్ వస్తేనే శబరికి రావాలని, వారితో పాటు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు కూడా తీసుకువస్తేనే అనుమతిస్తామని తెలిపారు.

Good news for devotees .. sabarimala temple open for devotees from November 16

దర్శనానికి వచ్చే భక్తులందరికీ స్క్రీనింగ్ చేస్తామని, వారికి కావలసిన మార్కులు శానిటైజర్ లను అందిస్తామని కరోనా వ్యాప్తి జరగకుండా దేవాదాయ శాఖ నుండి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.వర్చువల్ క్యూ విధానం ద్వారా భక్తుల సంఖ్యను పరిమితం చేస్తామని పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆలయ దర్శనానికి హాజరు కావడానికి భక్తులు 20 సంవత్సరాలు మరియు 50 కంటే తక్కువ వయస్సు ఉండాలని తెలిపారు.

Recommended Video

Khairtabad Ganesha : No Permission For Devotees To Visit Khairatabad Ganesha

కరోనా ప్రోటోకాల్‌ ప్రకారం భక్తుల ప్రవేశం ఒకేసారి ఐదుగురికి మాత్రమే పరిమితం చేయబడుతుంది.మహమ్మారికి వ్యతిరేకంగా ముందుజాగ్రత్తగా ట్రావెన్కోర్ దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఆలయాలలో నాలుగు నెలలకు పైగా భక్తుల దర్శనాలను నిషేధించింది.మొత్తానికి అయ్యప్ప మాల ధారుల కోసం శబరిమల యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కోవిడ్ నిబంధనల ప్రకారం దర్శనాలకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఏర్పాట్లలో నిమగ్నం అయింది .

English summary
The Sabarimala annual pilgrimage season will begin on November 16. pilgrimage will be conducted as per the COVID-19 protocol and the number of devotees will be restricted through the virtual queue system, Devaswom Minister Kadakampally Surendran has said. The COVID-negative certificates will be mandatory for devotees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X