వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్‌టాక్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఇన్‌స్టాగ్రామ్ ... రెడీ అయిపోండిక !!

|
Google Oneindia TeluguNews

చైనీస్ యాప్ అయిన టిక్ టాక్ పై నిషేధం వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లో నిత్యం వీడియోలు చేసే వారికి ,చూసే వారికి పెద్ద షాకింగ్ న్యూస్ కాగా ఇప్పుడు టిక్ టాక్ లేక తెగ బాధ పడుతున్న వారికి ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది . రీల్స్ పేరుతో ఇండియాలో తనదైన షార్ట్ వీడియో ఫీచర్‌ను విడుదల చేయనుంది ఇన్‌స్టాగ్రామ్. కొత్త ఫీచర్ వినియోగదారులను యాప్ లోనే వీడియోలను సృష్టించడానికి, సృజనాత్మక ఫిల్టర్లను,అలాగే మ్యూజిక్ ను జోడించడానికి కావాల్సిన ఫీచర్స్ ను అందిస్తుంది అని ఒక ప్రకటనలో తెలిపింది .

టిక్‌టాక్ మాదిరిగానే వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ గా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్

టిక్‌టాక్ మాదిరిగానే వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ గా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్

రీల్స్ టిక్‌టాక్ మాదిరిగానే బాగా ట్రెండ్ అయ్యి జనాదరణ పొందిన పాటలు, డైలాగ్స్ తో 15 సెకన్ల వీడియోను చేసే విధంగా వినియోగదారులకు ఫీచర్ అందిస్తుంది .ఇన్‌స్టాగ్రామ్‌లో 45 శాతం వీడియోలు 15 సెకన్లు లేదా అంతకంటే తక్కువ అని గ్రహించడం వల్ల ఇప్పుడు రీల్స్ ను తీసుకువచ్చినట్టు చెప్తున్నారు . ఐజిటివి మాదిరిగానే, వినియోగదారులు వారి ప్రొఫైల్ పేజీలో రీల్స్ విభాగాన్ని కూడా కలిగి ఉంటారు, ఇక్కడ వారి మొత్తం కంటెంట్ ఒకేసారి చూడవచ్చు.

ఎంటర్టైన్మెంట్ ఫ్యూచర్ గా రీల్స్

ఎంటర్టైన్మెంట్ ఫ్యూచర్ గా రీల్స్

ఫేస్‌బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ చెప్పిన వివరాల ప్రకారం, భారతదేశంలోని అన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో వీడియోలు మూడవ వంతు.

రీల్స్‌ను "ఎంటర్ టైన్ మెంట్ కు ఫ్యూచర్" అని పిలుస్తూ, ఫేస్‌బుక్ యొక్క ప్రోడక్ట్ ఉపాధ్యక్షుడు విశాల్ షా మాట్లాడుతూ, రీల్స్ యొక్క ఉద్దేశం భారతీయ కంటెంట్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ప్రచారం చెయ్యటం , ఇక ఇందులో వీడియోస్ చేసే వారు "గ్లోబల్ స్టార్స్" గా మారడం అని పేర్కొన్నారు. టిక్ టాక్ బ్యాన్ జరిగిన వారం రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకుని వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ గా మార్చటం గమనార్హం .

నేటి నుండి ఇండియాలో రీల్స్

నేటి నుండి ఇండియాలో రీల్స్

క్రొత్త ఫీచర్ యూజర్లు రీల్స్‌ను ఎక్స్‌ప్లోర్‌లో షేర్ చెయ్యొచ్చు. అంతేకాదు ఫీడ్‌ను అనుచరులతో పంచుకోవచ్చు . ప్రస్తుతానికి దీని ద్వారా ధనార్జన మార్గాలు ఉండవు.

ఈ కొత్త ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఫార్మాట్‌ను పరీక్షిస్తున్న బ్రెజిల్, జర్మనీ మరియు ఫ్రాన్స్‌ల తర్వాత భారతదేశం నాల్గవ దేశం. ఈ వీడియో షేరింగ్ ఫీచర్ భారతదేశంలోని వినియోగదారుల కోసం ఈరోజు 7:30 PM IST నుండి ప్రారంభమవుతుంది.

పాటలు, డైలాగ్స్ .. ఇలా ఏవైనా టిక్ టాక్ తరహాలో

పాటలు, డైలాగ్స్ .. ఇలా ఏవైనా టిక్ టాక్ తరహాలో

రీల్స్ కోసం, ఆసక్తికరమైన రీల్స్ సృష్టించడానికి మరియు అందరితో పంచుకోవడానికి వినియోగదారులకు కావాల్సిన పాటల సేకరణను అందించడానికి ఇన్‌స్టాగ్రామ్ ప్రముఖ మ్యూజిక్ సంస్థలతో భాగస్వామ్యం కూడా పెట్టుకుంది .బూమరాంగ్ మాదిరిగానే ఇన్‌స్టాగ్రామ్ కెమెరాకు రీల్స్ ఆప్షన్ కూడా ఇందులో కనిపిస్తుంది . వినియోగదారులను ప్రారంభించడానికి మొదట ఇన్‌స్టాగ్రామ్ కెమెరాను తెరిచి, 15 సెకన్ల వీడియోను సృష్టించడం ప్రారంభించడానికి ముందుగా ఆప్షన్ రీల్స్ ఎంచుకోవాలి. టిక్‌టాక్ మాదిరిగానే, రీల్స్ ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్ లైబ్రరీ, స్పీడ్, ఎఫెక్ట్స్ మరియు టైమర్ నుండి ఆడియో వంటి ఎంపికలను అందిస్తాయి.

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ల మాదిరిగా కాకుండా రీల్స్ అందరికీ ఎంటర్ టైనింగ్ ప్లాట్ ఫామ్

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ల మాదిరిగా కాకుండా రీల్స్ అందరికీ ఎంటర్ టైనింగ్ ప్లాట్ ఫామ్

రీల్‌ను రికార్డ్ చేసిన తర్వాత, వినియోగదారులు తమ రీల్‌ను భాగస్వామ్యం చేయాలనుకునే ప్రేక్షకులను ఎంచుకోవచ్చు. సాధారణ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ల మాదిరిగా కాకుండా, రీల్స్‌ను రీల్స్ విభాగంలో భాగస్వామ్యం చేయవచ్చు మరియు ప్లాట్‌ఫారమ్‌లోని ప్రతి ఒక్కరూ వాటిని చూడవచ్చు. వినియోగదారులు వారి వీడియోలకు ప్రత్యేకమైన ఎఫెక్ట్ ఇవ్వటానికి రీల్స్ వివిధ AR ఎఫెక్ట్స్ కూడా అందిస్తాయి. ఇలా ఎన్నైనా 15 సెకన్లు వీడియోలతో రీల్స్ ఒకేసారి రికార్డ్ చేయవచ్చు . అవసరమైతే రీల్స్‌ను తొలగించవచ్చు మరియు తిరిగి రికార్డ్ చేయవచ్చు. మొత్తానికి టిక్ టాక్ పోయిన వేళ ఆ లోటు తీర్చటానికి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తీసుకురావటం విశేషం . ఇంకేం మరి మీ టాలెంట్ ఇక నుండి ఇన్‌స్టాగ్రామ్ లో చూపించటానికి రెడీ అయిపోండి .

English summary
Instagram has launched its own short video feature called Reels in India. The new feature lets users create videos , add creative filters and music and share it . Reels is similar to TikTok and allows users to create 15 seconds video with popular songs, trends, or challenges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X