వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగారం ప్రియుల‌కు కేంద్రం తీపి క‌బురు..!త్వరలో కొత్త పసిడి విధానం..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ / హైద‌రాబాద్ : బ‌ంగారం ప్రియుల‌కు కేంద్రం బంగారం లాంటి వార్త వినిపించ‌బోతోంది. బంగారం ఎగుమ‌తులు మ‌రియు దిగుమ‌తుల‌లోని నిబంధ‌న‌ల‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు ప్ర‌ణాళిక ర‌చిస్తోంది. అంతే కాకుంగా భార‌త‌దేశంలో బంగారం ప్రియులు ఎక్కువ ఉండ‌డంతో ఆభ‌ర‌ణాల సౌల‌భ్య‌త‌ను అనూహ్యంగా పెంచేందుకు మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందింప్తోంది.

కేవ‌లం ప‌సిడి ప్రియుల‌కోస‌మే కాకుండా ఆభ‌రాణాల త‌యారీ దారుల‌తో పాటు, వ్యాపార వేత్త‌ల వెసులుబాటు బాటు గురించి కూడా కేంద్ర ప్ర‌భుత్వం స‌మాలోచ‌న‌లు చేయ‌బోతోంది. ఇదే అంశం పై కేంద్ర ప్ర‌భుత్వానికి అన్ని అంశాలు స‌హ‌క‌రిస్తే ప‌సిడి ఆభ‌రాణాల ధ‌ర‌లు కూడా అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

Good news for gold lovers ..! New gold policy soon..!!

పసిడిపై కేంద్రం ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తోంది. త్వరలో బంగారంపై కొత్త విధానం ప్రకటించే అవకాశం ఉందని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు గురువారమిక్కడ తెలియజేశారు. పసిడి పరిశ్రమ వృద్ధి, ఆభరణాల ఎగుమతుల వృద్ధి ప్రధాన లక్ష్యాలతో తాజా విధాన రూపకల్పన ఉంటుందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం మొత్తం భారత ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాల వాటా 15 శాతంగా ఉంది. విధాన రూపకల్పనలో భాగంగా సంబంధిత వర్గాలతో రానున్న కొద్ది రోజుల్లో సమావేశం కానున్నట్లు ప్రభు తెలిపారు. పసిడిపై ప్రస్తుతం 10 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతో బంగారం ధ‌ర‌లు బాగా దిగిరావొచ్చ‌నే చ‌ర్చ కూడా ట్రేడ్ విభాగాల్లో వినిపిస్తోంది.

English summary
The center is building a comprehensive approach on the gold business. Commerce Minister Suresh Prabhu said here today that the new policy will be announced soon. The growth of the gold industry and jewelery exports will be the latest policy design with major objectives, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X