వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్ న్యూస్: గృహ రుణాలపై వడ్డీ మరింత తగ్గే అవకాశం...దానికి లింక్ చేయడంతోనే..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గృహాలపై రుణం పొందాలనుకునే వారికి గుడ్ న్యూస్. త్వరలోనే గృహరుణాలపై వడ్డీ తగ్గే అవకాశం ఉంది. 8శాతం కంటే తక్కువగా గృహాలపై తీసుకునే రుణంకు సంబంధించి వడ్డీ తగ్గే అవకాశం ఉంది. డిసెంబర్ 5వ తేదీన జరిగే పాలసీ విధానాల సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుంది.

 25 బేసిస్ పాయింట్ల మేరా తగ్గనున్న రెపో రేట్

25 బేసిస్ పాయింట్ల మేరా తగ్గనున్న రెపో రేట్

డిసెంబర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన సమీక్ష చేయనుంది. ఈ సందర్భంగా రెపో రేట్‌ను మరో 25 బేసిస్ పాయింట్ల మేరా తగ్గించే అవకాశం ఉన్నందున గృహ రుణాలపై కూడా వడ్డీ తగ్గే అవకాశం ఉంది. చాలా బ్యాంకులు రెపో రేట్ ప్రకారం గృహ రుణాలపై వడ్డీని క్యాల్కులేట్ చేస్తున్నాయి. ఒక వేళ సమీక్ష సందర్భంగా రిజర్వ్ బ్యాంకు 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే అంటే రెపో రేట్‌ను 4.09శాతంకు తగ్గిస్తే కచ్చితంగా గృహ రుణాలపై వడ్డీ తగ్గుతుందని నిపుణలు చెబుతున్నారు.

ఎస్‌బీఐలో 7.95శాతం నుంచి వడ్డీ

ఎస్‌బీఐలో 7.95శాతం నుంచి వడ్డీ

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహరుణాలపై వడ్డీ బెంచ్‌మార్క్‌ను 8.05శాతంగా విధించింది. 25 బేసిస్ పాయింట్ల మేరా రెపో రేట్‌ను తగ్గిస్తే ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ 7.08శాతంకు తగ్గుతుంది. ఇక గృహ రుణాలపై వడ్డీ 7.95శాతం నుంచి ప్రారంభమవుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే వరకు రెపో రేట్లపై కఠినంగా వ్యవహరించబోమని గత సమీక్షా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ప్రస్తుతం దేశ జీడీపీ 4.5శాతంకు పడిపోవడంతో ఇక రెపో రేట్లను తగ్గించక తప్పదని నిపుణులు చెబుతున్నారు.

వరుసగా ఐదు సమావేశాల్లో రెపో రేట్ తగ్గింపు

వరుసగా ఐదు సమావేశాల్లో రెపో రేట్ తగ్గింపు


ఈ ఏడాదిలో జరిగిన ఐదు వరస ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆరుగురు సభ్యుల మోనిటరీ పాలసీ కమిటీ రెపో రేట్‌ను 1.35శాతం తగ్గిస్తూ వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం ఎక్కువగా ఉండాలన్న ఉద్దేశంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటు ఇంకా బలహీనంగా కనిపిస్తే అక్టోబర్‌లో ఎలా అయితే రెపో రేట్‌ను తగ్గించిందో.. అదే పద్ధతిని ఈ సారి కూడా ఇంప్లిమెంట్ చేస్తుందని ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఎకానమిస్టు చెప్పారు.

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ...

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ...


ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకున్న నిర్ణయాలు అమలులో ఉన్నప్పటికీ శనివారం విడుదలైన జీడీపీ లెక్కలు చూస్తే ఆందోళన కలిగిస్తున్నాయి. బేస్ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి తద్వారా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాలని భావించినా అది సాధ్యపడలేదు. ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉందని అది ఇలానే కొంతకాలం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేట్‌ను తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయని డెలాయిట్‌లో ఎకానమిస్టుగా పనిచేస్తున్న రుక్మిణి మజుందార్ చెప్పారు. మొత్తానికి డిసెంబర్‌లో జరిగే ఆర్బీఐ సమీక్షపైనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది.

English summary
The Interest rate on home loans may soon fall below 8% as the Reserve Bank of India is widely expected to cut repo rate by another 25 basis points in the forthcoming policy review on December 5
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X