వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్మికులకు శుభవార్త.. నెల సంపాదన 5 వేలా.. ఇకపై 10 వేలు రానుంది..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కార్మికులకు శుభవార్త. కనీస వేతనం రెట్టింపు కానుంది. ప్రస్తుతం రోజు కనీస సగటు వేతనం 176 రూపాయలు ఉండగా.. గరిష్ఠంగా 447 రూపాయలకు చేరనుంది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ ఇది వర్తించనుంది. దేశ స్థాయిలో కనీస వేతనాల అమలు కోసం ఏర్పాటైన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు.. కేంద్రం త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 29 రాష్ట్రాలను 5 విభాగాలుగా చేస్తూ కనీస వేతనాలను ప్రతిపాదించిన కమిటీ.. నివేదికను కేంద్ర కార్మిక శాఖకు పంపింది. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ కనీస వేతనం 380 రూపాయలుగా.. నెలకు 9 వేల 880 రూపాయలుగా పేర్కొంది.

కనీస వేతనాల అమలుకు గతంలో చూసినట్లయితే దేశవ్యాప్తంగా 3 రీజియన్లు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్యను ఐదుకు పెంచారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను బట్టి ఏ ఏ రాష్ట్రాలు ఏయే రీజియన్లలో ఉండాలనేది కమిటీ సూచించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఈ రెండు కూడా రీజియన్ - 2 లో ఉన్నాయి. కనీస వేతనం డబుల్ చేస్తూ సిఫార్సు చేసిన కమిటీ.. ఇంటి అద్దె రోజుకి 55 రూపాయలంటూ అదనంగా పేర్కొంది.

good news to labour wages may doubled shortly

రాష్ట్రాలు, రీజియన్ల వారీగా ఆ కమిటీ సిఫార్సు చేసిన కనీస వేతనం వివరాలు:

రీజియన్ రాష్ట్రాలు రోజు కనీస వేతనం నెలవారీ కనీస వేతనం
రీజియన్ -1 అసోం, బీహార్, ఝార్ఖండ్ , మధ్యప్రదేశ్, ఒడిశా, యూపీ, పశ్చిమ బెంగాల్ 342 రూపాయలు 8,892 రూపాయలు
రీజియన్‌-2 ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ,రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌
,ఉత్తరాఖండ్‌
380 రూపాయలు 9,880 రూపాయలు
రీజియన్‌-3 గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు 414 రూపాయలు 10,764 రూపాయలు
రీజియన్‌-4 ఢిల్లీ, గోవా, హిమాచల్ ప్రదేశ్ , హర్యానా, పంజాబ్ 447 రూపాయలు 11,622 రూపాయలు
రీజియన్‌-5 ఈశాన్య రాష్ట్రాలు 386 రూపాయలు 10,036 రూపాయలు
English summary
Good news for workers. The minimum wage will be doubled. At present, the average minimum wage of Rs 176 per day is now at a maximum of 447 rupees. It is applicable to all workers working in different sectors. The Center will soon give green signal to the recommendations of experts committee to implement minimum wages at the national level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X