వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్ న్యూస్: ఫోన్‌పేలో భారీ రిక్రూట్‌మెంట్.. ఆ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే 550 మందిని రిక్రూట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కష్ట సమయాల్లో కూడా సంస్థను బలోపేతం చేసే క్రమంలో ఈ అడుగు వేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఈ ఉద్యోగాలు ఏ విభాగాల్లో ఉండనున్నాయి..?

పేటీఎం గూగుల్ పేలకు పోటీగా ఫోన్ పే

పేటీఎం గూగుల్ పేలకు పోటీగా ఫోన్ పే

డిజిటల్ పేమెంట్స్ అయిన పేటీఎం గూగుల్ పేలకు పోటీగా ఉన్న ఫోన్ పే లాక్‌డౌన్ సమయంలో కూడా ఇతర సంస్థల్లా కాకుండా తమ ఉద్యోగస్తులకు వేతనాల్లో కోత విధించలేదు సరికదా వారి వేతనాలను పెంచే యోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఫోన్‌పే సంస్థలో 1800 మంది పనిచేస్తుండగా దీనికి అదనంగా 20 శాతం నుంచి 30శాతం తీసుకోవాలని ఫోన్‌ పే యాజమాన్యం భావిస్తోంది. ఇతర సంస్థల్లో ఉద్యోగులను తొలగిస్తుండగా ఇందుకు భిన్నంగా ఫోన్‌ పే అడుగులు ముందుకు వేస్తోంది.

 నిరుద్యోగులకు మంచి ఛాన్స్

నిరుద్యోగులకు మంచి ఛాన్స్


గత మూడు నెలలుగా నియామకాలు ఒక రకంగా ఉంటే ఇప్పుడు మరో రకంగా ఉంటున్నాయని చెప్పారు ఫోన్‌ పే సహవ్యవస్థాపకులు రాహుల్ చారీ. ఈ సారి నియమకాలను అత్యంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు రాహుల్ చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు బాగోలేనందున చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారని అలాంటి వారిలో అన్ని అర్హతలున్న వారిని నియమించుకుంటామని స్పష్టం చేశారు రాహుల్. ఇక ఇంజినీరింగ్, కార్పొరేట్, సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్ శాఖల్లో కొత్తగా సిబ్బందిని నియమించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. గత మూడేళ్లుగా ప్రాడక్ట్ పరంగా ఎంతో వృద్ధి చెందామని రాహుల్ చెప్పారు.

90 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన ఫ్లిప్‌ కార్ట్

90 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన ఫ్లిప్‌ కార్ట్

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ద్వారా చెల్లింపులకు అనుమతినిస్తున్న ఫోన్ పే.... ఆ యాప్ పై 183 బ్రాండ్లకు సంబంధించి అమ్మకాలు జరుపుతోంది. ఇదిలా ఉంటే ఫోన్ పే మాతృసంస్థ ఫ్లిప్‌కార్ట్ 90 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ప్రస్తుతం వాట్సాప్ పే కూడా మంచి మార్కెట్‌ను సంపాదిస్తున్న క్రమంలో దీనికి ధీటుగా ఫోన్‌ పే ముందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే భారీ రిక్రూట్‌మెంట్‌తో పాటు పెట్టుబడులు వచ్చాయి. వాట్సాప్‌ పే మాతృసంస్థ ఫేస్‌బుక్‌ మరియు రిలయన్స్ జియోతో మరింత బలోపేతం అవుతోంది.

ఇంజినీరింగ్ శాఖతో నియామకాలు ప్రారంభం

ఇంజినీరింగ్ శాఖతో నియామకాలు ప్రారంభం

ఇక ఫోన్ పే సంస్థ క్రమంగా తన శాఖలను బలోపేతం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా ఇంజినీరింగ్ విభాగంపై దృష్టి సారించింది. ప్రస్తుతం అక్కడ 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా ఈ విభాగంలో మరో 200 మందిని నియమించుకుని ఆ సంఖ్యను 500కు చేర్చాలని భావిస్తోంది. ఇలా సిబ్బందిని పెంచడం వల్ల ప్రాడక్ట్ బలోపేతం కావడమే కాదు... యాజమాన్యంపై మరింత బాధ్యత పెంచుతుందని భావిస్తున్నారు. ఇక ఇంజినీరింగ్ విభాగంలో వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఇతర శాఖలను కూడా మార్పులు చేర్పులు చేస్తామని స్పష్టం చేశారు రాహుల్ చారీ.

English summary
The digital payment app Phone Pe plans to hire 550 people this year thus sending out positive signals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X