వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరికొన్నిగంటల్లో కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : భానుడి భగ భగలతో అల్లాడుతున్న ప్రజలకు తీపి కబురు. మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో వారం రోజుల్లో రుతుపవాలు తెలుగు రాష్ట్రాలను చేరే అవకాశం ఉంది.

good news to farmers ..

భారీ వర్షాలే ..
జూన్ 9న కొల్లా, అలప్పులా జిల్లాను రుతుపవనాలు తాకుతాయని పేర్కొంది. 10న తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో ఆ ప్రాంతంలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ అధికారులు జారీచేశారు. ఇటు నైరుతి అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. వాతావరణం మార్పు నేపత్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

ఉత్తరాదిలో వారం ఆలస్యం
దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవనుండటంతో .. ఉత్తరాదిలో మాత్రం కాస్త ఆలస్యంగా రుతుపవనాలు వెళ్లనునాన్నాయి. అక్కడ మరో వారం ఎండలు కొడతాయని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, ఉత్తర్ ప్రదేశ్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో మరో 4 రోజుల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టంచేశారు. ఈ సారి దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. వడదెబ్బతో జనం పిట్టల్లా రాలిపోయారు. నైరుతి రుతుపవనాల కోసం జనం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి రుతుపవనాల రాక వారం ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకాల్సి ఉంది. కానీ మరో వారంరోజుల తర్వాత తీరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో భానుడు భగ భగలు మరింత ఎక్కువయ్యాయి. ఇటు మరోవైపు ఈ ఏడాది వర్షపాతం .. సాధారణం కన్నా తక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. తమ పంటపొలం సంగతి ఏంటని మదన పడుతున్నారు. సమృద్ధిగా వర్షం కురిస్తే ... పంటలు పండుతాయని ... తమ జీవనం బాగుంటుందని రైతులు భావిస్తున్నాు. వర్షాలు లేకపోతే పరిస్ధితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

English summary
The Indian Meteorological Department has said that southwest monsoon will hit Kerala in the next 24 hours. Monsoon is likely to reach Telugu states in another week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X