వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక్కడ జగన్.. అక్కడ మోడీ: స్పీకర్ విషయంలో సేమ్ కామెంట్.. నిజంగా జరుగుతుందా..?

|
Google Oneindia TeluguNews

ఇటీవలి కాలంలో స్పీకర్‌ వ్యవస్థపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేయడం చూశాం. స్పీకర్‌గా ఉన్న వ్యక్తి అధికారపక్షం వైపే మొగ్గు చూపుతున్నారనే వాదనలు విన్నాం. అయితే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు స్పీకర్ వ్యవస్థను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్రంలో ప్రధాని మోడీ, ఏపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌లు స్పీకర్ వ్యవస్థకు మరింత గౌరవం తీసుకువచ్చేలా సంకేతాలు పంపారు. స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అంటూ వారు సభలో చెప్పడం చూస్తే స్పీకర్ అనే స్థానానికి ఇకముందు ఉన్నతమైన గౌరవం రాబోతుందా అనేది ఒక చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలు సభలో ఇక రిపీట్ కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్పీకర్ వ్యవస్థకు ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీలు కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.

జ‌గ‌న్ డోన్ట్‌కేర్‌: సీఎంగా మీ బాధ్య‌త‌..టీడీపీ న్యాయ పోరాటం: చ‌ంద్రబాబు ఆందోళ‌న ఏంటంటే..! జ‌గ‌న్ డోన్ట్‌కేర్‌: సీఎంగా మీ బాధ్య‌త‌..టీడీపీ న్యాయ పోరాటం: చ‌ంద్రబాబు ఆందోళ‌న ఏంటంటే..!

 స్పీకర్‌పై మోడీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

స్పీకర్‌పై మోడీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

లోక్‌సభ సమావేశాలకు ప్రారంభానికి ముందు మోడీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంఖ్యాబలం గురించి విపక్షాలు ఆందోళన చెందాల్సిన పనిలేదని వారిచ్చే అమూల్యమైన సలహాలను సీరియస్‌గా తీసుకుని ఆమేరకు ప్రభుత్వం పనిచేస్తుందని మోడీ వ్యాఖ్యానించారు. ఇక కొత్త స్పీకర్‌గా ఓంబిర్లా ఎన్నిక తర్వాత మోడీ మాట్లాడుతూ సభను కంట్రోల్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుందని చెప్పారు. రాజకీయనాయకుడి కంటే ముందు ఓం బిర్లా మంచి మానవతా వాదని కొనియాడారు. తాను తన నియోజకవర్గంలో బడుగుబలహీన వర్గాల వారి శ్రేయస్సు కోసం చేసిన సామాజిక కార్యక్రమాలే ఈ విషయాన్ని తెలుపుతాయని పేర్కొన్నారు. తమ సభ్యులు ఎవరైనా సరే సభాసాంప్రదాయాలు పాటించకపోతే వారిపై చర్యలు తీసుకునే పూర్తి హక్కు స్పీకర్‌కు ఉందని మోడీ తెలిపారు. తనపై కూడా చర్యలు తీసుకోవచ్చని ప్రధాని తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి కూడా తమ సంపూర్ణ మద్దతును స్పీకర్‌కు ప్రకటించారు. స్పీకర్‌ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని ఇటు అధికార పక్షం అటు విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు చౌదరి తెలిపారు. ప్రజల సమస్యలు చర్చకు వచ్చే సమయంలో తమకు తగిన సమయం ఇవ్వాలని కోరారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలి: జగన్

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలి: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి జగన్ స్పీకర్‌కు అత్యంత విలువను ఇచ్చారు. స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంకు పూర్తి స్వేచ్ఛను కల్పించారు ముఖ్యమంత్రి జగన్. ఎవరు ఏమి చెప్పినా సభలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్‌గా ఉండాలని జగన్ కోరారు. అధికారపక్షంకు మాట్లాడే అవకాశం ఎలాగైతే ఇస్తున్నారో... ప్రతిపక్షాలు కూడా ప్రజాసమస్యలపై చర్చించేటప్పుడు అధిక సమయం కేటాయించాలని సీఎం జగన్ కోరారు. గత ప్రభుత్వంలో మైక్ కట్ చేయడంలాంటివి ఈ సభలో జరగకూడదని సీఎం జగన్ అన్నారు. మరోవైపు ఫిరాయింపులపై కూడా స్పీకర్ పూర్తి స్వేచ్ఛతో నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఎమ్మెల్యే జంప్ అయితే వారిని డిస్‌క్వాలిఫై చేయాలని స్పీకర్‌ తమ్మినేనిని కోరారు సీఎం. సభలో అధికార పార్టీ సభ్యులు హద్దుమీరితే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడకూడదని చెప్పిన జగన్... స్పీకర్‌గా తమ్మినేని నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనే ప్రగాఢ నమ్మకం తనకుందని చెప్పారు.

తెలంగాణలో ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోని స్పీకర్ పోచారం

తెలంగాణలో ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోని స్పీకర్ పోచారం

ఇదిలా ఉంటే మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో మాత్రం ఫిరాయింపుల పరంపర కొనసాగుతోంది. కాంగ్రెస్‌లో గెలిచి గులాబీ గూటికి జై కొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏపీలో జగన్‌ చెప్పిన మాటలను ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ధర్నా కూడా చేశారు. అయితే స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ టికెట్‌ పై గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.


మొత్తానికి కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ, ఏపీలో సీఎం జగన్‌లు స్పీకర్ అనే పదానికి మంచి విలువ ఇచ్చారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పలువురు పొలిటికల్ అనలిస్టులు. స్పీకర్‌కు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం అనేది ప్రాముఖ్యమైన విషయమని వారు గుర్తు చేస్తున్నారు. హద్దుమీరితే అధికార పక్షం ప్రతినిధులపై కూడా చర్యలు తీసుకోవచ్చని సభలో చెప్పడం కొత్త తరం రాజకీయాలకు మంచి సంకేతాలు పంపుతున్నారని అనలిస్టులు కొనియాడారు. వీరిని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఆయా స్పీకర్లకు పూర్తి స్వేచ్ఛను కల్పించాలని అనలిస్టులు కోరుతున్నారు. అప్పుడే ప్రజాస్వామ్య విలువలు పెరుగుతాయని, ప్రజాస్వామ్యం బతుకుతుందని అభిప్రాయపడుతున్నారు.

English summary
Kota MP Om Birla was elected unanimously as the speaker of the Loksabha. While congratulating Om Birla, PM Modi said that the speaker has all rights to take a decision on the members of the house if anyone misbehaved. Modi also said that the speaker could take decision if the treasury members surpassed the rules of the house. In the same way AP Chief Minister YS Jagan also gave the same freedom to the speaker of AP assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X