వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

17 రోజుల నుంచి కనిపించకుండా పోయిన రైలు

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: ఇప్పటివరకు విమానాలు కనిపించకుండా పోయిన వార్తలే విన్నాం. కానీ ఇప్పుడు ఏకంగా రైలు కూడా కనిపించకుండా పోయిందనే వార్తలు వస్తున్నాయి. జోధ్‌పూర్ నుంచి గుజరాత్ బయలుదేరిన ఓ గూడ్స్ రైలు కనిపించకుండా పోయింది. అది కూడా 17 రోజుల నుంచి.

వివరాల్లోకి వెళితే.. ఓ గూడ్స్ రైలు జులై 27న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి గుజరాత్‌లోని ముంద్రా రేవుకు వెళ్లేందుకు బయల్దేరింది. ఎగుమతుల వ్యాపారం చేసే రంజన్ కన్సారా అనే వ్యక్తి ఆ రైలును సరుకు రవాణా కోసం బుక్ చేసుకున్నారు. ఆ రైలులో మొత్తం 90 కంటైనర్లు ఉన్నాయి.

Goods train which left Jodhpur for Gujarat missing since 17 days

కాగా, ఒక్కో కంటైనర్‌లో రూ. 10 లక్షలు విలువ చేసే సామాగ్రి ఉంది. అంటే మొత్తం రూ. 9కోట్ల విలువ చేసే సామాగ్రితో ఆ రైలు బయల్దేరింది. మూడు రోజుల్లోగా గుజరాత్ చేరుకోవాల్సిన ఆ రైలు మధ్యలోనే కనిపించకుండా పోయింది.

ఇప్పటికి 17 రోజులైనా రైలు గమ్యస్థానాన్ని చేరుకోలేదు. ఆన్‌లైన్‌లో స్టేటస్ చూస్తే ఆగస్టు 2వ తేదీ నుంచి ఆ రైలు అహ్మదాబాద్‌లో ఉన్నట్లు చూపిస్తోంది. కానీ, రైలు అక్కడ కన్పించలేదు. దీనిపై రంజన్ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. వర్షాల కారణంగా రైలు ఆలస్యమై ఉంటుందేమోనని అధికారులు తెలిపినట్లు సమాచారం.

English summary
In a bizarre news, a goods train that set out from Jodhpur for Mundra Port in Gujarat on July 27 is reported to have gone missing for the past 17 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X