వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ చేతికి 'హళ్లి': స్థాపించిన నాలుగు నెలలకే బంపర్ ఆఫర్..

తాజాగా గూగుల్ సైతం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌ను అభివృద్ది చేస్తున్న 'హళ్లి' అనే ఓ స్టార్టప్ సంస్థను కొనుగోలు చేసింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిన తర్వాత.. డేటా భద్రత సంరక్షణ బాధ్యతలు ఆయా కంపెనీలకు కీలకంగా మారాయి. ఇందుకోసం భవిష్యత్తులో కేవలం మానవ నైపుణ్యంపై ఆధారపడకుండా.. ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్‌ను అభివృద్ది చేసుకునే పనిలో చాలా సంస్థలు నిమగ్నమయ్యాయి.

మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, ఐబీఎం, యాపిల్‌ లాంటి తదితర టెక్ దిగ్గజాలు ఈ దిశగా ఇప్పటికే పరిశోధనలు సాగిస్తుండగా.. తాజాగా గూగుల్ సైతం ఇదే బాటలో పయనిస్తోంది. బెంగుళూరు కేంద్రంగా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌ను అభివృద్ది చేస్తున్న 'హళ్లి' అనే ఓ స్టార్టప్ సంస్థను గూగుల్ తాజాగా కొనుగోలు చేసింది.

Google acquires Bangalore-based artificial intelligence firm Halli Labs

హళ్లి కొనుగోలుకు సంబంధించి దాని సహ వ్యవస్థాపకులైన స్టేజిల్లా, పంకజ్ గుప్తాలు ఒక బ్లాగు ద్వారా వివరాలను వెల్లడించారు. స్థాపించిన నాలుగు నెలల వ్యవధిలోనే 'హళ్లి' గూగుల్‌ను ఆకర్షించడంపై మిగతా ఐటీ కంపెనీల్లోను చర్చ మొదలైంది.

దీన్నిబట్టి ఐటీ కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌కు ఎంత ప్రాధాన్యమిస్తున్నాయో స్పష్టమవుతోంది. కాగా, 2020కల్లా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ మార్కెట్ 50బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఇప్పటినుంచే దానిపై ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

సెల్ఫ్ డ్రైవింగ్, క్లయింట్స్ తో చాట్ వంటి విషయాల్లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో దీనికి మరింత డిమాండ్ ఉన్న రీత్యా గూగుల్ 'హళ్లి' ల్యాబ్స్‌ను కొనుగోలు చేసిందని భావించవచ్చు. అయితే హళ్లి కొనుగోలు కోసం ఎంత మొత్తాన్ని వెచ్చించిదనేది ఇంతవరకు తెలియరాలేదు.

English summary
American technology giant Google has acquired Bangalore-based artificial intelligence (AI) firm Halli Labs for an undisclosed sum.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X