వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Happy Birthday Google: 21వ ఏటాలోకి సెర్చ్ ఇంజిన్..చరిత్ర ఓ సారి చూద్దాం!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Happy Birthday Google : Google Celebrates 21St Birth Day || Special Video About Google || Oneindia

భయ్యా... ఈ అడ్రస్‌కు వెళ్లాలంటే ఎటెళ్లాలి..? తమ్ముడూ ఆ దేశాధ్యక్షుడు ఎవరు.. ఏమైనా ఐడియా ఉందా..? ప్రపంచంలో అతిపెద్ద అభయారణ్యం ఎక్కడవుంది.. తెలిస్తే కాస్త చెప్పవూ..? ఇలాంటి వాటికి సమాధానం ఒకప్పుడు అడిగి తెలుసుకునే వాళ్లం. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రపంచంలో ఏదైనా సరే, ఏ సమాచారం అయినా సరే తెలుసుకోవాలంటే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అందులో గూగుల్ డాట్ కామ్ టైప్ చేయడం, మనకు కావాల్సిన సమాచారం టైప్ చేస్తే చాలు ఇట్టే లభిస్తుంది. అంతలా సామాన్యుడితో పెనేసుకుపోయింది గూగుల్ తల్లి. ఈ రోజు గూగులమ్మకు 21 ఏళ్లు వచ్చాయి.

సామాన్యుడితో పెనువేసుకుపోయిన గూగుల్

సామాన్యుడితో పెనువేసుకుపోయిన గూగుల్

గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజిన్. ఒకప్పుడు ప్రపంచంలో జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలంటే టీవీల్లోనో, లేదంటే మరుసటి రోజున వచ్చే పేపర్‌లోనో చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు జమానా మారింది. గూగుల్ రాకతో అన్నీ అరచేతిలోని స్మార్ట్ ఫోన్‌లతోనే తెలిసిపోతున్నాయి. అవును గూగుల్ అంతలా దైనందిత జీవితంతో ముడిపడిపోయింది. గూగుల్ లేకపోతే జీవితమే లేదన్నట్లుగా అయిపోయింది. ఏ చిన్న సమాచారం కావాలన్న గూగుల్‌కు ఒక్క జై కొడితే చాలు క్షణాల్లో సమాచారం మీముందు ఉంటుంది.

గూగుల్ గూగుల్‌కు డూడుల్‌తో గ్రాండ్ వెల్కమ్

గూగుల్ గూగుల్‌కు డూడుల్‌తో గ్రాండ్ వెల్కమ్

గూగుల్ తల్లి జన్మించి సరిగ్గా ఈరోజుతో 21 ఏళ్లయ్యాయి. సెప్టెంబర్ 27, 1998లో గూగుల్ పురుడుపోసుకుంది. గూగుల్ జన్మదినంను పురస్కరించుకుని గూగుల్ డూడుల్ ఘనంగా బర్త్‌డే గ్రీటింగ్స్ తెలిపింది. ఓ పాతతరం కంప్యూటర్ అందులో గూగుల్ బ్రౌజర్ విండోను ఏర్పాటు చేసి గ్రాండ్ విషెస్ తెలిపింది.

గూగుల్ పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర

అది 1998వ సంవత్సరం .స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలోని ఓ చిన్న గది. ఈ గదే ప్రపంచానికి దిక్సూచిలా మారుతుందని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే గూగుల్ తల్లి జన్మించింది ఈ చిన్న గదిలోనే. గూగుల్‌కు ఊపిరిపోసింది ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులు. వారే లారీ పేజ్ మరియు సెర్జీ బ్రిన్. 1998 సెప్టెంబర్ వీరిద్దరికీ చాలా బిజీగా ఉన్న నెల. ఎందుకంటే ఆ నాటి వీరి శ్రమే ఈ రోజున గూగుల్ వ్యవస్థాపక దినోత్సవంగా గుర్తింపుపొందింది. 1998 సెప్టెంబర్ 7న గూగుల్ అనే పేరు ఇచ్చి కంపెనీని స్థాపించారు.

21 ఏళ్ల విజయవంతంగా సాగిన ప్రయాణం

21 ఏళ్ల విజయవంతంగా సాగిన ప్రయాణం

ముందుగా గూగుల్ ఒరిజినల్ పేరు గూగల్. గణిత పరిభాషనుంచి తెచ్చుకున్నపేరు. ఆ తర్వాత తాము కొత్తగా ఓ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలుపుతూ ఓ పేపర్‌ను పబ్లిష్ చేశారు లారీ పేజ్ మరియు సెర్జీ బ్రిన్. ముందుగా వారికి యాహూ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈ పోటీని తట్టుకుని విజయంవైపు అడుగులేసింది గూగుల్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గూగుల్ తల్లిని వినియోగిస్తున్నారు. దాదాపు 100 భాషల్లో ఇది అందుబాటులో ఉంది. ఇంటర్నెట్‌లో ఏటా ట్రిలియన్ ప్రశ్నలకు గూగుల్ సమాధానం ఇస్తోంది.

మొత్తానికి ప్రతి ఒక్కరికి ప్రపంచమూలానా ఎక్కడున్నా వారికి కావాల్సిన సమాచారం ఇచ్చేందుకే పుట్టిన గూగుల్ తల్లికి మనం కూడా బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పేద్దాం. హ్యాపీ బర్త్‌డే గూగుల్..!

English summary
Its been 21 years that the popular search engine Google came into existence. In this backdrop Google has commemorated the day with a doodle with a caricature of a vintage computer and a Google browser window on it
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X