వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీది సాహసమే: పెద్ద నోట్ల రద్దుపై సుందర్ పిచాయ్ ఏమన్నారంటే?

భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. భారత దేశ పర్యటనలో ఉన్న ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించే ముందే ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

పెద్ద నోట్ల రద్దు విషయంలో తాను నిపుణుడిని కాకపోయినా ఇది సాహసోపేతమైన నిర్ణయమని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో గూగుల్ సంస్థ ఏ విధంగానైనా సాయం చేసే అవకాశముంటే అందుకు తాము సిద్ధమని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

'పెద్ద వేదికలలో మార్పులు తీసుకొచ్చినప్పుడు విశేషమైన ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు ప్రజలకు ఫోన్లు ఉండి.. వాటిలో లోకేషన్ గుర్తించే వీలుండటం రైడ్-షేరింగ్(క్యాబ్) సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రవాణా వ్యవస్థలో విశేషమైన మార్పులు వచ్చాయి అని వెల్లడించారు.

Google CEO Sundar Pichai calls demonetisation a bold move for India

అదే విధంగా పెద్ద నోట్ల రద్దును తాను తక్కువ అంచనా వేయనని తెలిపారు. భారత్‌లో ఇలాంటి వాటి వల్ల విశేషమైన బహుళ ప్రయోజనాలుంటాయని చెప్పారు. ఇతర దేశాలు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనే భారత్ ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

ల్యాండ్ లైన్లకు బదులు సెల్‌ఫోన్లు వాడుతున్నామని, అదే విధంగా డిజిటల్ చెల్లింపులు దేశానికి గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు అనుకుంటున్న దానికన్నా మెరుగైన మౌలిక వసతులు దేశంలో ఉన్నాయని పిచాయ్ తెలిపారు. డిజిటల్ కార్యకలాపాలతో మెరుగైన మార్పులు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు.

English summary
Google CEO, Sundar Pichai is in India and has been making plenty of headlines. Before meeting the students and giving a speech at IIT-Kharagpur, Pichai told the Economic Times, that the prime minister’s demonetisation move was a bold one for a country like India, and if things turn out as intended, it could propel the country t global ranks in terms of digital payments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X