వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్‌లో ఉద్యోగులపై వేటు... కారణం ఏమిటో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

శాన్‌ఫ్రాన్సిస్కో: మహిళా ఉద్యోగిణులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఫిర్యాదు రావడంతో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ 48 ఉద్యోగస్తులపై వేటు వేసింది. ఇందులో 13 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఉన్నారు. గూగుల్ సంస్థలో పనిచేసే సీనియర్ ఉద్యోగి ఆండ్రాయిడ్ క్రియేటర్ ఆండీ రూబిన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రుజువు కావడంతో ఆయనకు 90 మిలియన్ అమెరికన్ డాలర్లు ఇచ్చి కంపెనీ నుంచి తొలగిస్తున్నట్లు ఆ సంస్థ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ లేఖ విడుదల చేశారు.

వేటుపడ్డ వారిలో 13 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు

వేటుపడ్డ వారిలో 13 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు

గత రెండేళ్లలో సంస్థలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులు పాల్పడ 48 ఉద్యోగులను గుర్తించామని అందులో 13 మంది సీనియర్ మేనేజర్ పోస్టుల్లో ఉన్నావారేనని గూగుల్ సంస్థ తమ ఉద్యోగులందరికి ఈమెయిల్ పంపింది. ఇందులో 13 మంది సీనియర్ మేనేజర్లకు మాత్రం ఎగ్జిట్ ప్యాకేజ్ ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇదివరకే చెప్పినట్లు సుందర్ పిచాయ్ లేఖలో పేర్కొన్నారు.

సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ నేడే...మరో ట్విస్ట్ సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ నేడే...మరో ట్విస్ట్

సంస్థలో మహిళల భద్రతే ప్రథమ కర్తవ్యం

సంస్థలో మహిళల భద్రతే ప్రథమ కర్తవ్యం

"గూగుల్ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించడం మా ప్రథమ కర్తవ్యం. అంతేకాదు పనిచేసే చోట్ల ఇలాంటి తప్పుడు వ్యవహారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. లైంగిక వేధింపులపై వచ్చిన ప్రతి ఒక్క ఫిర్యాదును తీసుకుని దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం " అని సుందర్ పిచాయ్ తెలిపారు. ఇదిలా ఉంటే ఆండ్రాయిడ్ క్రియేటర్ రూబిన్ తరపున సామ్ సింగర్ అనే ప్రతినిధి మాట్లాడారు. రూబిన్ అలాంటి వ్యక్తి కాదని చెప్పారు. రూబిన్‌ను ఎవరూ తొలగించలేదని తను సొంతంగా మరో సంస్థ ప్రారంభించేందుకే గూగుల్ నుంచి బయటకు వచ్చారని సామ్ సింగర్ తెలిపారు. అంతేకాదు ఎసెన్షియల్ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ కంపెనీని ప్రారంభించారని సామ్ సింగర్ తెలిపారు.

రూబిన్ రాజీనామా చేయాల్సిందిగా 2013లో ఒత్తిడి

రూబిన్ రాజీనామా చేయాల్సిందిగా 2013లో ఒత్తిడి


గత పదేళ్లుగా రూబిన్ పై లైంగిక ఆరోపణలు వస్తున్నప్పటికీ గూగుల్ సంస్థ ఆయన్ను కాపాడుకుంటూ వస్తోందని ఇందుకు సంబంధించిన కోర్టు డాక్యుమెంట్లను ఇంటర్వ్యూలను న్యూయార్క్ టైమ్స్ బహిర్గతం చేసింది. అంతేకాదు అప్పటి గూగుల్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న లారీ పేజ్‌ రూబిన్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమని తేలడంతో అప్పుడే రాజీనామా ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చారని న్యూయార్క్ టైమ్స్‌కు ఇద్దరు గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పినట్లు ఆ పత్రిక వెల్లడించింది. 2013లో ఓ హోటల్ గదిలో మహిళను లైంగికగా వేధించినట్లు గూగుల్ సంస్థ అంతర్గత విచారణలో తేలిందని పత్రిక వెల్లడించింది.

English summary
Google said Thursday it fired 48 employees in the past two years, including 13 senior executives, as a result of sexual harassment allegations, citing "an increasingly hard line" on inappropriate conduct.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X