వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Google Good News:గూగుల్‌లో భారీ పర్మినెంట్ రిక్రూట్‌మెంట్...జాబితాలో భారత్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు గూగుల్‌లో పనిచేసే మెజార్టీ ఉద్యోగులు థర్డ్ పార్టీ ద్వారా నియామకం అయ్యేవారు. వారంతా గూగుల్‌లో తాత్కాలిక ఉద్యోగస్తులుగా పనిచేసేవారు. కానీ ఇప్పుడు గూగుల్ సంస్థనే స్వయంగా రంగంలోకి దిగనుంది. ఆ సంస్థనే ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన రిక్రూట్ చేసుకోనుంది.

 గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్..3800 ఉద్యోగాలు

గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్..3800 ఉద్యోగాలు

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు గూగుల్ శుభవార్త చెప్పింది. శాశ్వత ప్రాతిపదికన 3800 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టెక్ దిగ్గజం ప్రకటించింది. ఇప్పటి వరకు గూగుల్‌ నియామకాలను థర్డ్ పార్టీ చూసుకునేది. అలా రిక్రూట్ అయిన వారు గూగుల్‌కు పనిచేస్తున్నప్పటికీ వారు మాత్రం ఆ సంస్థ పేరోల్స్‌పై ఉండరు. వారు థర్డ్ పార్టీ పేరోల్స్ కిందకే వచ్చేవారు. కానీ ఇప్పుడు గూగుల్ స్వయంగా రంగంలోకి దిగి ప్రపంచ వ్యాప్తంగా 3800 మంది ఉద్యోగస్తులను నియమించుకోవాలని డిసైడ్ అయి ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచ దేశాల జాబితాలో భారత్ కూడా ఉండటం విశేషం.

 సేవలను విస్తరించాలని భావిస్తున్న టెక్ దిగ్గజ సంస్థ

సేవలను విస్తరించాలని భావిస్తున్న టెక్ దిగ్గజ సంస్థ

ఇప్పటి వరకు గూగుల్‌కు కావాల్సిన కస్టమర్ సపోర్ట్ సేవలు, ప్రాడక్ట్ ట్రబుల్ షూటింగ్, మరియు ప్రచార వ్యవస్థను ఇతర థర్డ్ పార్టీలు గూగుల్ తరపున అందించేవి. ఈ థర్డ్ పార్టీలు ఉద్యోగస్తులను రిక్రూట్ చేసుకుని గూగుల్ కోసం పనిచేయించేవి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ హబ్‌ల నుంచే గూగుల్ కార్యకలాపాలు జరిగేవి. ఇప్పుడు ఆ పద్దతి లేకుండా నేరుగా గూగుల్ తమకు కావాల్సిన ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనుంది. 2020లో మిస్సిసిపీలో గూగుల్ ఆపరేషన్స్ సెంటర్‌ను ప్రారంభించి భారత్ ఫిలిప్పీన్స్ దేశాల్లో కార్యకలాపాలను విస్తరిస్తామని గూగుల్ ఆపరేషన్స్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ ట్రాయ్ డ్రికర్‌సన్ తెలిపారు. కస్టమర్ సపోర్ట్ సేవలను విస్తరించాలన్న యోచనతో గూగుల్ 2018లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ నియామకాలు చేపట్టనున్నట్లు సమాచారం.

 శాశ్వత ఉద్యోగస్తులుగా మారనున్న 1000 మంది ఎంప్లాయిస్

శాశ్వత ఉద్యోగస్తులుగా మారనున్న 1000 మంది ఎంప్లాయిస్

ఇక మొత్తం 4800 మందిని తీసుకోనున్నట్లు చెప్పిన డికర్సన్... ఇప్పటికే 1000 మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారని వారందరినీ శాశ్వత ఉద్యోగస్తులుగా పరిగణించి గూగుల్ నుంచి వచ్చే అన్ని బెనిఫిట్లు ఇస్తామని చెప్పారు. ఇందులో భాగంగా మూడువారాల వెకేషన్ సెలవులు, 22 వారాల పేరెంటల్ పెయిడ్ లీవ్, ఆరోగ్యపరమైన బెనిఫిట్లు వారికి వర్తిస్తాయని చెప్పారు. అంతేకాదు పనిచేస్తున్నవారు స్థానిక కల్చరల్ క్లబ్స్‌లో ఉచితంగా భోజనం చేసే వెసులుబాటు కూడా ఉంటుందని డికర్సన్ తెలిపారు.

 అమెరికా సెనేటర్లు కోరిక మేరకే..

అమెరికా సెనేటర్లు కోరిక మేరకే..

గూగుల్ సంస్థలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగస్తులుగా పరిగణించాలని అమెరికా సెనేటర్లు యాజమాన్యాన్ని కోరడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా ఆరు నెలలకు పైగా పనిచేసిన వారిని మాత్రమే శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని సెనేటర్లు చెప్పారు. గూగుల్ 1,21,000 మందిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన గూగుల్ నియమించుకుందని ప్రముఖ పత్రికలో వార్తలు ప్రచురింపబడటంతో సెనేటర్లు ఈ డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. గూగుల్‌ కోసం పనిచేసే ఉద్యోగస్తులందరినీ సమానంగా చూడాలని సెనేటర్లు చెప్పారు. ఇదిలా ఉంటే తమ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులపై వివక్ష ఉండదని శాశ్వత ఉద్యోగస్తులతో సమానంగానే చూడటం జరుగుతుందని పీపుల్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఎలీన్ నాటన్ తెలిపారు.

English summary
After facing criticism that the tech giant relies more on low-cost, third-party temporary workers, Google has announced to hire 3,800 "in-house" full-time employees in 2020 at various sites, including in India who will provide customer care support 24/7.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X