• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Kerala Island: కొత్త దీవి కలకలం -Google Maps చూపిస్తున్నది నిజమేనా? -Kochi తీరంలో ఏం జరిగింది?

|

కేరళ హైకోర్టు పరిధిలోకి వచ్చే కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో స్థానిక బీజేపీ పాలకులు తెచ్చిన కొత్త చట్టాలపై రచ్చ జరుగుతుండం, ఈ విషయంలో విమర్శలు చేసిన సినీ నటి ఆయేషా సుల్తానాపై ప్రభుత్వం ఏకంగా దేశద్రోహం కేసు పెట్టం, ఆమెకు కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తదితర పరిణామాలు తెలిసిందే. అయితే, ఇప్పుడా వివాదంతో సంబంధంలేని మరో ఆశ్చర్యకరమైన విషయంతో ఆ ప్రాంతాలు మళ్లీ వార్తల్లో నిలిచాయి. కేరళ తీరం నుంచి అరేబియా సముద్రలోగల లక్ష ద్వీప్ దీవులకు మధ్య దూరం సుమారు 500 కిలోమీటర్లు. కాగా, కేరళలోని కొచ్చి తీరం నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఓ దీవి ఉన్నట్లు వెల్లడికావడం సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నది. దానికి సంబంధించిన పూర్తి వివరాలివి..

Miyazaki Mango:ప్రపంచంలో ఖరీదైన మామిడి -కేజీ 2.7లక్షలు -ఎంపీలో 7పండ్లకు 6 కుక్కలు, 4గార్డుల కాపలా Miyazaki Mango:ప్రపంచంలో ఖరీదైన మామిడి -కేజీ 2.7లక్షలు -ఎంపీలో 7పండ్లకు 6 కుక్కలు, 4గార్డుల కాపలా

మిస్టరీ ఐలాండ్..

మిస్టరీ ఐలాండ్..


కేరళ తీరంలో ఓ దీవి ఉన్నట్లు గూగుల్ మ్యాప్స్‌లో కనిపించడంతో నిపుణులు సైతం అవాక్కయ్యారు. కొచ్చి తీరానికి 7 కిలోమీటర్ల దూరంలో అరేబియా స‌ముద్ర గ‌ర్భంలో ఓ దీవిలాంటి నిర్మాణం అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నది. గూగుల్ మ్యాప్స్ బ‌య‌ట‌పెట్టిన ఈ మిస్ట‌రీ ఐలాండ్‌పై ఇప్పుడు మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గ‌నున్నాయి. అస‌లీ దీవి ఎలా ఏర్ప‌డింది? ఇది సముద్రం లోపల ఉందా? ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేకపోయారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అనుమానిత దీవిపై కేర‌ళ యూనివ‌ర్సిటీ ఆఫ్ ఫిష‌రీస్ అండ్ ఓషియ‌న్ స్ట‌డీస్ (కుఫోస్‌) ప‌రిశోధ‌న‌లకు సిద్ధ‌మ‌వుతున్నది..

covid పుట్టుకపై షాకింగ్ ట్విస్ట్: chinaలో కాదు, అమెరికాలోనే -whoతో దర్యాప్తునకు డ్రాగన్ డిమాండ్covid పుట్టుకపై షాకింగ్ ట్విస్ట్: chinaలో కాదు, అమెరికాలోనే -whoతో దర్యాప్తునకు డ్రాగన్ డిమాండ్

ఎలా బయటపడింది?

ఎలా బయటపడింది?

చెల్ల‌న‌మ్ క‌ర్షిక టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ అనే సంస్థ తొలిసారిగా ఈ మిస్టరీ దీవిని గుర్తించింది. ఈ నెల తొలివారంలోనే త‌మ ఫేస్‌బుక్ పేజీలో ఈ నిర్మాణం గురించి ఆ సంస్థ ఓ పోస్ట్ పెట్టింది. అరేబియా స‌ముద్రంలో ఓ దీవిలాంటి నిర్మాణం క‌నిపిస్తున్న‌ట్లుగా గూగుల్ మ్యాప్స్ చూపిస్తోంద‌ని, కొచ్చి తీరానికి ఏడు కిలోమీట‌ర్ల దూరంలో గుర్తించామని, ఆ దీవి లాంటి నిర్మాణం పొడవు 8 కి.మీ. పొడ‌వు, 3.5 కి.మీ. వెడ‌ల్పుగా ఉందని, ఈ నిర్మాణాన్ని తాము గ‌త నాలుగేళ్లుగా చూస్తూనే ఉన్నామ‌ని చెల్ల‌న‌మ్ సంస్థ అధ్య‌క్షుడు కేఎక్స్ జూల‌ప్ప‌న్ వెల్లడించారు. సదరు పోస్టుపై కుఫోస్‌ యూనివ‌ర్సిటీ అనూహ్యంగా స్పందించింది. కుఫోస్‌ వర్సిటీ వీసీ రిజి జాన్ వెంటనే చెల్ల‌న‌మ్ సంస్థ అధ్య‌క్షుడిని సంప్రదించారు. దీనిపై పరిశోధనలు చేద్దామని ముందుకు కదిలారు..

అది దీవేనా? ఎలా ఏర్పడింది?

అది దీవేనా? ఎలా ఏర్పడింది?

గూగుల్ మ్యాప్స్ చూపిస్తున్నట్లుగా అది నీటి లోప‌ల ఉన్న దీవిలా క‌నిపిస్తున్నదని, సాధార‌ణంగా ఇలాంటివి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉంటాయని, అయితే, కేరళ తీరంలో ఎలా ఏర్ప‌డిందనే విషయం పరిశోధనతోనే తేలుతుందని కుఫోస్‌ వర్సిటీ వీసీ రిజి జాన్ అంటున్నారు. అంతేకాదు, స్థానిక మ‌త్య్స‌కారులు కొచ్చి పోర్టులో చేస్తున్న డ్రెడ్జింగ్ కార‌ణంగా ఏర్ప‌డిన నిర్మాణం కావ‌చ్చ‌ని ఆయన అభిప్రాయపడ్డారు. సాధార‌ణంగా ఇలాంటి నిర్మానాలు నీటి అడుగున ప్ర‌వాహం, అక్రెష‌న్ (తీర అవ‌క్షేపం తిరిగి ఒడ్డుకు రావ‌డం), తీరంం కోత‌కు గురి కావ‌డం వ‌ల్ల ఏర్ప‌డుతుంటాయ‌ని, నిజానికి కేర‌ళ ద‌క్షిణ ప్రాంతంలో తీరం కోత‌కు గురి కావ‌డ‌మ‌నే సమస్య ఉందనీ ఆయన వెల్లడించారు. ఇప్పుడీ నిర్మాణంపై కేర‌ళ ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు స‌ద‌రు యూనివ‌ర్సిటీ ఓ ప్రాజెక్టును రూపొందిస్తున్నది.

English summary
Is it an island near the coast of Kerala? A new bean-like structure in the water near India’s west coast off Kerala has surprised many after it showed up on Google Maps. The island-like structure was, however, not spotted in the Arabian Sea, reported The News Minute, which quoted officials of Kerala University of Fisheries and Ocean Studies (KUFOS). The experts will now probe if the new phenomenon is an underwater structure that has gone unnoticed till date. The new revelation on Google Maps has baffled many, including experts, after Chellanam Karshika Tourism Development Society wrote a letter to KUFOS, media reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X