వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ స్టార్టప్ స్కూల్ ఇండియా: 10వేల స్టార్టప్‌లకు శిక్షణ; చిన్న నగరాలలోనూ స్టార్టప్‌లకు ఊతం!!

|
Google Oneindia TeluguNews

గూగుల్ సంస్థ భారత్లో స్టార్టప్ స్కూల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాలే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలోనూ దాదాపు పదివేల స్టార్టప్ లకు సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

చిన్న నగరాలలోనూ స్టార్టప్ ల కోసం.. గూగుల్ స్టార్టప్ స్కూల్ ఇండియా

చిన్న నగరాలలోనూ స్టార్టప్ ల కోసం.. గూగుల్ స్టార్టప్ స్కూల్ ఇండియా


చిన్న నగరాల్లోని స్టార్టప్‌లు వివిధ సవాళ్లను అధిగమించేందుకు, అవి నిలదొక్కుకోవడం కోసం టెక్ దిగ్గజం స్టార్టప్ స్కూల్ ఇండియా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లో (చిన్న నగరాలు) 10,000 స్టార్టప్‌లకు ఈ కార్యక్రమం సహాయపడుతుందని గూగుల్ భావిస్తోంది. వర్చువల్‌గా నిర్వహించే తొమ్మిది వారాల ప్రోగ్రామ్, ఫిన్‌టెక్, బిజినెస్-టు-బిజినెస్ మరియు బిజినెస్-టు-కన్స్యూమర్ ఇ-కామర్స్, లాంగ్వేజ్, సోషల్ మీడియా మరియు నెట్‌వర్కింగ్, జాబ్ వంటి అంశాలపై చర్చలు జరపనుంది.

 స్టార్టప్ స్కూల్ ఇండియా ద్వారా అనేక అంశాలలో శిక్షణ

స్టార్టప్ స్కూల్ ఇండియా ద్వారా అనేక అంశాలలో శిక్షణ

స్టార్టప్ స్కూల్ ఇండియా ద్వారా సమర్థవంతమైన ఉత్పత్తి వ్యూహాన్ని రూపొందించడం, ఉత్పత్తి వినియోగదారు విలువపై లోతైన విశ్లేషణలు, భారతదేశం వంటి మార్కెట్‌లలో వినియోగదారుల కోసం యాప్‌లను రూపొందించడం, అలాగే కొత్త యూజర్లను దక్కించుకోవడానికి పాటించాల్సిన వ్యూహాలపై దీనిలో శిక్షణనిస్తారు. స్టార్టప్ వ్యవస్థకు సంబంధించి పలువురు దిగ్గజాలతో చర్చా కార్యక్రమాలను నిర్వహించడం తో పాటు, స్టార్టప్ కంపెనీలకు తోడ్పాటు నిచ్చే అనేక అంశాలపై అవగాహన కల్పిస్తారు.

స్టార్టప్ లలో మూడో స్థానంలో భారత్

స్టార్టప్ లలో మూడో స్థానంలో భారత్

దాదాపు 70,000 స్టార్టప్‌లతో, భారతదేశం ప్రపంచంలోనే స్టార్టప్‌లలో మూడవ స్థానంలో ఉంది. ఎక్కువ మంది భారతీయ వ్యవస్థాపకులు తమ కంపెనీలను IPOలు లేదా యునికార్న్ హోదాకు విజయవంతంగా నడిపిస్తున్నందున, వారి సక్సెస్ స్టోరీ లు కూడా దేశవ్యాప్తంగా ఉన్న యువ భారతీయులలో ఆకాంక్షలను రేకెత్తించి స్టార్టప్ ల వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి. బెంగళూరు, ఢిల్లీ, ముంబై లేదా హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా, జైపూర్, ఇండోర్, గోరఖ్‌పూర్ మరియు ఇతర ప్రాంతాలలో కూడా మంచి స్టార్టప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.వాస్తవానికి, ప్రస్తుతం భారతదేశంలో గుర్తింపు పొందిన స్టార్టప్‌లలో ఇవి దాదాపు 50% ఉన్నాయి.

మొదటి ఐదేళ్ళలో విఫలమవుతున్న స్టార్టప్ లు.. అందుకే గూగుల్ స్టార్టప్ స్కూల్ ఇండియా

మొదటి ఐదేళ్ళలో విఫలమవుతున్న స్టార్టప్ లు.. అందుకే గూగుల్ స్టార్టప్ స్కూల్ ఇండియా

అన్ని స్టార్టప్‌లలో 90% తమ ప్రయాణంలో మొదటి ఐదేళ్లలో విఫలమవుతున్నాయని, ఇలాంటి కీలక కారణాల వల్ల నగదు నిర్వహణ లోపం, లోపభూయిష్ట డిమాండ్ అంచనా, అసమర్థమైన ఫీడ్‌బ్యాక్ లూప్‌లు లేదా నాయకత్వం లేకపోవడం వంటి కారణాల వల్ల విఫలం అవుతున్నాయని గూగుల్ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది. తాజాగా గూగుల్ స్టార్ట్ అప్ స్కూల్ ఇండియా చొరవ ఈ వైఫల్యాలను గుర్తించి, స్టార్టప్ లు వైఫల్యాల నుండి బయటపడడానికి అవసరమైన ప్రోగ్రాంలను అందిస్తుందని తెలుస్తుంది.

English summary
Google initiation to support startups in india started a 9 weeks program called Startup School India. With this google giving Training 10K Startups. It is giving a boost to startups even in small cities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X