• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పేటీఎంకు భారీ షాక్: గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ తొలగింపు - గ్యాంబ్లింగ్‌ - ఐపీఎల్ టోర్నీ ఎఫెక్ట్?

|

ఈకామర్స్ చెల్లింపులు, ఫైనాన్షియల్ టెక్నాలజీలో అగ్రగామిగా కొనసాగుతోన్న 'పేటీఎం'కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ తన ప్లేస్టోర్ లో నుంచి పేటీఎం యాప్ ను తొలగించింది. గూగుల్ అభివృద్ధి చేసిన గుగుల్ పే యాప్ కు పేటీఎం యాప్ కు మధ్య వ్యాపార సంబంధ పోటీకొనసాగుతుండటం, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టోర్నీ ప్రారంభం కానున్న తరుణంలో ప్లే స్టోర్ నుంచి పేటీఎంను తొలగించడం చర్చకు దారితీసింది.

మోదీ, దోవల్ సెక్యూరిటీ డేటా చోరి? - ఎన్ఐసీ కంప్యూటర్లపై సైబర్ దాడి - దర్యాప్తులో సంచలన అంశాలు

అందుకే తీసేశాం..

అందుకే తీసేశాం..

పేటీఎం యాప్ ను గుగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించడం ఇదే తొలిసారి. శుక్రవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్న గూగుల్ సంస్థ.. అందుకుగల కారణాలను కూడా వివరించింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ను ప్రోత్సహిస్తూ, మోసపూరిత చెల్లింపులతో నిబంధనల అతిక్రమించిన కారణంగానే పేటీఎం యాప్ ను ప్లేస్టోర్ నుంచి తొలగించామని గూగుల్ పేర్కొంది. ‘‘ఇండియాలో గ్యాంబ్లిక్ కు సంబంధించి గూగుల్ ప్లే విధానాలు'' పేరుతో గూగుల్ తన బ్లాగ్ లో ఓ ప్రకటన విడుదల చేసింది. పేటీఎం సంస్థ ఇచ్చే వివరణను బట్టి యాప్ పునరుద్ధరణపై ప్లే స్టోర్ నిర్ణయం తీసుకోనుంది.

కీలక సమయంలో మోదీకి జగన్ అండ - వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు - బీజేపీ మిత్రులే షాకిచ్చిన వేళ

ఆన్ లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్..

ఆన్ లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్..

‘‘గూగుల్ ప్లేస్టోర్ లో వినియోగదారులకు సురక్షితమైన యాప్ లను మాత్రమే అందుబాటులో ఉంచుతాం. అదే సమయంలో యాప్ డెవలపర్లు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే వేదికగానూ మేం వ్యవహరిస్తాం. మా భాగస్వాములు అందరినీ పరిగణలోకి తీసుకునే గ్లోబల్ పాలసీలు రూపొందించుకున్నాం. ఈ క్రమంలోనే ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ లేదా ఆన్ లైన్ జూదాన్ని లేదా ఆన్ లైన్ బెట్టింగ్స్ ను సులభతరం చేసే విధానాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోము'' అని గూగుల్ సంస్థ తన బ్లాగులో స్పష్టం చేసింది.

ఐపీఎల్‌ నేపథ్యంలో?

ఐపీఎల్‌ నేపథ్యంలో?

పేటీఎం యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించిన అంశంపై గూగుల్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ పాలసీ విభాగం వైస్ ప్రెసిడెంట్ సుజానే ఫ్రెయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రీడలకు సంబంధించిన బెట్టింగ్ ను ప్రోత్సహించే యాప్ లను గుగుల్ ప్లేస్టోర్ అనుమతించబోదు, ఆయా టోర్నమెంట్లపై వినియోగదారులు డబ్బులు గెలుచుకునే విధానాలు కూడా మా పాలసీకి వ్యతిరేకమైనవే'' అని ఆమె చెప్పారు. సుజానే నేరుగా ఐపీఎల్ పేరు చెప్పనప్పటికీ, క్రికెట్ మెగా ఈవెంట్ చుట్టూ భారీగా బెట్టింగులు జరగొచ్చన్న అంచనాల నేపథ్యంలో పేటీఎం యాప్ ను తొలగించడం కీలకంగా మారింది.

మీ డబ్బులు సేఫ్..

మీ డబ్బులు సేఫ్..

గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగించారన్న వార్త వినియోగదారుల్లో కలవరం రేపింది. ఇప్పటికే పలు చైనా యాప్ లపై నిషేధాల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో పేటీఎంపై గూగుల్ చర్యలు కొత్త అనుమానాలకు తావిచ్చినట్లయింది. దీంతో పేటీఎం సంస్థ కీలక ప్రకటన చేసింది. ‘‘పేటీఎం యాప్ త్వరలో ప్లే స్టోర్‌లోకి తిరిగి వస్తుంది. పేటీఎంలోని మీ డబ్బులు నూరుశాతం సేఫ్ గా ఉన్నాయి. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఇప్పటికే యాప్ కలిగిఉన్నవాళ్లు చెల్లింపులను యధావిధిగా కొనసాగించుకోవచ్చు'' అని పేటీఎం తెలిపింది.

English summary
In a surprise move, Google on Friday pulled the Paytm app from Google Play store. Google has said that it won’t endorse any gambling app on its platform and has posted a blog that talks about Play gambling policies. We have reached out to Paytm for the story and will be updating once we hear from them. Google on Friday posted a blog titled “Understanding our Play gambling policies in India” where it highlighted the issues related to such apps that endorse or promote gambling in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X