వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Google ధన్యవాదాలు: మీ సేవలు అభినందనీయం..మరువలేనివి..!

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో హాట్ టాపిక్ కరోనా వైరస్. ముఖ్యంగా ఈ వైరస్‌పై ప్రపంచదేశాలు పోరాడుతున్న తీరు భేష్ అనే చెప్పాలి. కరోనావైరస్‌ మహమ్మారి ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసింది. ఇక దీనిపై పోరాడేందుకు చాలామంది వైద్య సిబ్బంది ఇతర సిబ్బంది కూడా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు. అలాంటి వారిని గూగుల్ ప్రత్యేకంగా గుర్తిస్తూ వారిని డూడుల్ ద్వారా అభినందించింది. అదే సమయంలో ధన్యవాదాలు తెలిపింది. ఆరోగ్య వ్యవస్థను ప్రత్యేకంగా రూపొందించిన జీఐఎఫ్‌ ద్వారా అభినందించింది.

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనావైరస్ మహమ్మారిపై ఆరోగ్య వ్యవస్థలో పనిచేసే సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ముందువరసలో ఉండి సేవలందిస్తున్నారు. ఇందులో వైద్యులు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లు, క్లీనర్లు, భద్రతా సిబ్బంది ఇలా ఒకరేంటి చాలామంది రిస్క్ తీసుకుని కరోనావైరస్‌పై పోరాడుతున్నారు.

Google thanks Corona warriors through doodle for fight over Covid-19

అలాంటి వారికి ఇంగ్లీషులో గూగుల్ ఒక చిన్న సందేశం పంపింది. గూగుల్ డూడుల్ ద్వారా ఇంగ్లీషులో "Thankyou to all"అని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా పీడిస్తున్న నేపథ్యంలో సర్వ మానవాళి ఇంతకుముందెన్నడూ లేనంతగా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారని ఒకరికి అండగా మరొకరు నిలుస్తున్నారని గూగుల్ తన సందేశంలో పేర్కొంది. ఇలాంటి వారిని గుర్తించి గౌరవించేందుకు డూడుల్ సిరీస్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. అందుకే ప్రతి కరోనావారియర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ గూగుల్ తన వెబ్‌సైట్‌లో పోస్టు రాసుకొచ్చింది.

ఇక మహమ్మారిపై ఎప్పటికప్పుడు అవగాహన తీసుకొస్తూ నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలను తన వెబ్‌సైట్‌పై గూగుల్ పోస్టు చేస్తోంది. డూడుల్ ద్వారా ఈ అప్‌డేట్స్ ఇస్తోంది. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కరోనావైరస్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటివి చేయకూడదు, ఎలాంటివి చేయాలి అనే అంశాలను డూడుల్ ద్వారా పోస్టు చేస్తూ నెటిజెన్లకు తాజా సమాచారంను పంచుతోంది. కరోనావైరస్ కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో వైరస్‌ను అంతమొందించేందుకు ఈ జాగ్రత్తలు పాటించండంటూ కొన్ని జాగ్రత్త చర్యలను ట్విటర్‌లో కూడా పోస్టు చేసింది.

అంతేకాదు కరోనావైరస్ జాగ్రత్త చర్యల్లో భాగంగా నిపుణులు సూచించినట్లుగా భౌతిక దూరం పాటించాలని గూగుల్ ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లింది. ఆ తర్వాత ఆగష్టు నెలాఖరులో ఆరడుగుల దూరం పాటిస్తున్నందుకు ధన్యవాదాలంటూ మరొక పోస్టును పెట్టింది. భారత్‌లో క్రమంగా లాక్‌డౌన్ ఎత్తివేస్తున్న సమయంలో పోస్టు చేసింది.

English summary
Search Engine giant Google had thanked all the coronavirus helpers through doodle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X