• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Google Trends 2020: భారత్‌లో వైరస్ కంటే వేగంగా వ్యాపించిన పదం అదొక్కటే: కరోనా వెనక్కి

|

న్యూఢిల్లీ: సుదీర్ఘకాలం పాటు ప్రజల మెదళ్ల నుంచి చెరిగిపోని సంవత్సరం ఇది. వెన్నులో వణుకు పుట్టించే ఏడాదిగా మిగిలి పోయింది. ప్రపంచవ్యాప్తంగా 14.50 లక్షల మందికి పైగా ప్రజలను పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్ ఈ ఏడాది మొత్తాన్నీ కబలించేసింది. దీని ప్రభావం ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంత ప్రమాదకరమైన వైరస్‌‌ను కూడా వెనక్కి నెట్టిన పదం ఒకటుంది. ఈ ఏడాదిలో అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన పదం అది.

రసిక ప్రియులకు Pornhub భారీ షాక్: వీడియోల డౌన్‌లోడ్‌పై కీలక నిర్ణయం: అలాంటి పనులకు బ్రేక్రసిక ప్రియులకు Pornhub భారీ షాక్: వీడియోల డౌన్‌లోడ్‌పై కీలక నిర్ణయం: అలాంటి పనులకు బ్రేక్

 టాప్ సెర్చింగ్‌లో ఐపీఎల్..

టాప్ సెర్చింగ్‌లో ఐపీఎల్..

ఐపీఎల్-2020. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన పదాల జాబితాలో టాప్‌లో నిలిచింది. రెండున్నర నెలల కాలంలోనే అత్యధికంగా సెర్చ్ చేసినట్లు గూగుల్ గుర్తించింది. ఈ ఏడాది అత్యధికంగా ట్రెండింగ్‌లో నిలిచిన జాబితాను గూగుల్ ప్రకటించింది. నెటిజన్లు సెర్చ్ చేసిన పదాలవారీగా వాటిని వేర్వేరు కేటగిరీల్లోకి చేర్చింది. ఐపీఎల్.. రెండు కేటగిరీల్లో టాప్‌లో నిలిచింది.

 అత్యధికులు వెదికిన న్యూస్ కేటగిరీలో..

అత్యధికులు వెదికిన న్యూస్ కేటగిరీలో..

అత్యధిక మంది నెటిజన్లు న్యూస్ కేటగిరీలో సెర్చ్ చేసిన పదాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్.. అగ్రస్థానంలో నిలిచింది. మూడు నెలల వ్యవధిలో అంచనాలకు మించిన స్థాయిలో నెటిజన్లు ఐపీఎల్ గురించి వివరాలను తెలుసుకోవడానికి సెర్చ్ చేసినట్లు గూగుల్ పేర్కొంది. ఐపీఎల్ తరువాత.. కరోనా వైరస్ అనే పదం రెండో స్థానంలో నిలిచింది. ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్ ఆరంభం అయ్యేంత వరకూ కరోనా వైరస్ పదం గూగుల్ సెర్చింగ్‌లో టాప్ నిలిచింది. ఎప్పుడైతే ఐపీఎల్ ఫీవర్ ప్రారంభమైందో..అప్పటి నుంచీ కరోనా వైరస్ కిందికి దిగజారింది. Indian Premier League తొలి స్థానంలో నిలిచింది.

 అమెరికా అధ్యక్ష ఎన్నికలు టాప్ త్రీలో

అమెరికా అధ్యక్ష ఎన్నికలు టాప్ త్రీలో

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వివరాల కోసం కూడా నెటిజన్లు భారీ సంఖ్యలో గూగుల్‌లో వెదికారు. వార్తల కేటగిరీలో ఈ పేరు మూడో స్థానంలో నిలిచింది. US Presidential Election అనే పదాలతో సెర్చింగ్ చేశారు. నాలుగో స్థానంలో Nirbhaya case అనే పదం నిలిచింది. ఉత్తర ప్రదేశ్‌లో దళిత యువతిని నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం అనంతరం నిర్భయ కేసు గురించి వెదికినట్లు తెలుస్తోంది. అయిదో స్థానంలో Beirut explosion నిలిచింది. ఆరో స్థానంలో Lockdown, ఏడో స్థానంలో China-India skirmishes నిలిచాయి. Bushfires in Australia అనే పదం ఎనిమిదో ప్లేస్‌ను దక్కించుకుంది. Locust swarm attack, Ram Mandir అనే పదాలు తొమ్మిది, పది స్థానాల్లో నిలిచాయి.

 సినిమాల్లో దిల్ బేచారా

సినిమాల్లో దిల్ బేచారా

అత్యధికులు సెర్చ్ చేసిన సినిమాల్లో Dil Bechara టాప్‌లో నిలిచింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి సినిమా ఇది. ఆ తరువాత Soorarai Pottru, Tanhaji, Shakuntala Devi, Gunjan Saxena మూవీలు తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి. ఆ తరువాత.. Laxmii, Sadak 2, Baaghi 3, Extraction, Gulabo Sitabo టాప్ టెన్‌లో చివరి అయిదు స్థానాలను దక్కించుకున్నాయి.

 అత్యధికులు వెదికిన వ్యక్తుల జాబితాలో జో బిడెన్..

అత్యధికులు వెదికిన వ్యక్తుల జాబితాలో జో బిడెన్..

అమెరికా కొత్త అధ్యక్షుడు Joe Biden.. అత్యధికులు వెదికిన వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తరువాత ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ Arnab Goswami రెండో స్థానంలో నిలిచారు. బాలీవుడ్ నటి Kanika Kapoor, ఉత్తరకొరియా నియంత Kim Jong-un, నటుడు Amitabh Bachchan, సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ Rashid Khan, నటి Rhea Chakraborty, అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలు Kamala Harris, బాలీవుడ్ యాక్ట్రెసెస్ Ankita Lokhande, Kangana Ranaut టాప్-10లో ఉన్నారు.

English summary
Search engine giant Google has revealed its Year in Search results for the year 2020. Among the major news events, the Indian Premier League, Coronavirus and US elections triggered noteworthy search activity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X