• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎయిర్ హోస్టెస్ గీతిక సోదరుడిని కొట్టిన కందా లాయర్

By Pratap
|

Gopal Goyal Kanda's lawyer slaps Geetika Sharma's brother in court
న్యూఢిల్లీ: హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందా తరఫు న్యాయవాది తనను కోర్టులో కొట్టినట్లు మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ సోదరుడు బుధవారంనాడు ఆరోపించాడు. కేసు విచారణకు సంబంధించిన తదుపరి తేదీపై ఇరు పక్షాలు వాదనలు వినిపిస్తుండగా ఈ సంఘటన జరిగిందని అంటున్నారు. ఆ సమయంలో న్యాయమూర్తి కోర్టురూంలో లేరు.

గీతికా శర్మ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో నిందితుడైన గోపాల్ గోయల్ కందా ప్రస్తుతం బెయిల్‌పై బయటే ఉన్నారు. ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మను ఆత్మహత్యకు పురికొల్పారనే ఆరోపణపై కందా, అయన అనుచరురాలు అరుణ చద్దాలపై కేసు నమోదైంది.

వారిద్దరు కూడా తనను వేధించారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని గీతికా శర్మ సూసైడ్ నోట్ రాసి పెట్టింది. గీతిక శర్మ 2012 ఆగస్టు 4,5 తేదీల మధ్య ఆత్మహత్య చేసుకుంది.

2012 ఆగస్టు నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో కందా బెయిల్ దరఖాస్తును ట్రయల్ కోర్టు మార్చి 4వ తేదీన అనుమతినిచ్చింది.

English summary
Former air hostess Geetika Sharma's brother on Wednesday alleged that the lawyer of former Haryana minister Gopal Goyal Kanda slapped him at a court here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X